Nara Lokesh: దసరా వస్తే సీఎం జగన్ ఈ పని చేస్తారు: నారా లోకేశ్

జగన్ అంధకార ప్రదేశ్ అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చారని నారా లోకేశ్ చురకలు అంటించారు.

Nara Lokesh

Nara Lokesh – YS Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఏలూరు జిల్లా గణపవరం (Ganapavaram) బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ… దసరా వస్తే జగన్ కోడి కత్తికి పూజ చేస్తారని ఎద్దేవా చేశారు.

జగన్ అంధకార ప్రదేశ్ అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చారని నారా లోకేశ్ చురకలు అంటించారు. జగన్ సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్ ను దరిద్రం వేధిస్తోందని చెప్పారు. కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడితే వాటిని చింపే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. తాము కూడా బాబాయిని అబ్బాయిలు చంపారని ఫ్లేక్సీలు పెట్టాలా? అని అన్నారు.

బాంబులకే భయపడిని కుటుంబం టీడీపీ అని, ఫ్లెక్సీలకు భయపడుతుందా అని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక జోన్, ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా, బేషరతుగా ఆక్వా రైతులకి యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తామని అన్నారు. వారికి పరికరాలు, యంత్రాలు సబ్సిడీలో అందిస్తామని చెప్పారు. యువగళం పాదయాత్రను కనీసం ఒక్క రోజైనా ఆపాలని జగన్ అనుకుంటున్నారని, ఆయన కోరిక తీరలేదని అన్నారు.

Telangana elections 2023: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి విడత జాబితా వచ్చేస్తుంది.. ఆ జాబితానే ఫైనల్: రేవంత్ రెడ్డి