Telangana elections 2023: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి విడత జాబితా వచ్చేస్తుంది.. ఆ జాబితానే ఫైనల్: రేవంత్ రెడ్డి

తొలి విడత అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.

Telangana elections 2023: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి విడత జాబితా వచ్చేస్తుంది.. ఆ జాబితానే ఫైనల్: రేవంత్ రెడ్డి

Revanth Reddy

Updated On : September 3, 2023 / 7:49 PM IST

Revanth Reddy – Telangana elections 2023: తెలంగాణలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయాలు తీసుకుంటోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు.

ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితాను సీల్డ్ కవర్లో తమ స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పనిలోనే మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లోనే ఉంటుందని వివరించారు. ఈ నెల 6న ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశమవుతుందని, పీఈసీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేస్తుందని చెప్పారు.

స్క్రీనింగ్ కమిటీ నుంచి జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిస్తుందని వివరించారు. తొలి విడత అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిటీ తుది జాబితా ప్రకటిస్తుందని చెప్పారు. అప్పటివరకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనకు కూడా సమాచారం ఉండదని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయబోతున్నామని వివరించారు.

One Nation One Election: ముందస్తు ఎన్నికలు ఒట్టి మాటేనా.. ఊహాగానాలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి