Nara Lokesh: ఆ పేరు మార్చడంతో ప్రజలు నవ్వుకుంటున్నారు: నారా లోకేశ్ ఎద్దేవా

దేని పైన పోరాటం చేస్తున్నారో ముందు వారికి స్పష్టత ఉంటే బాగుంటుందని నారా లోకేశ్ చెప్పారు.

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇవాళ వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి, 20లక్షల ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చించాలని వైసీపీ సభ్యుల వాయిదా తీర్మానం ఇచ్చారు.

దాన్ని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వాటిపై చర్చించాలని మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఛైర్మన్ పోడియం ముందుకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

Also Read: తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు: చంద్రబాబు

ప్రజలు నవ్వుకుంటున్నారు: లోకేశ్
సభ్యుల ఆందోళనతో ఈ అంశంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఫీజురీయింబర్స్‌మెంట్ 4500 కోట్లు బకాయిలు పెట్టారని తెలిపారు. ఇప్పుడు ఫీజు పోరు అని పేరు పెట్టి యువత పోరు అని పేరు మార్చడంతో ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

దేని పైన పోరాటం చేస్తున్నారో ముందు వారికి స్పష్టత ఉంటే బాగుంటుందని నారా లోకేశ్ చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్, సహా వైసీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు పోయాయో చర్చిద్దామని అన్నారు. అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇక ఏ పార్టీ రంగులు లేని యూనిఫామ్ లు ధరిస్తారని అన్నారు. రాజకీయ నాయకుడి చిత్రం, ప్రభుత్వ బ్రాండ్ లేని యూనిఫామ్ లు, కిట్స్ తో పాఠశాలలకు వెళ్తారని తెలిపారు. నాణ్యమైన విద్య, ప్రతి బిడ్డకు మంచి భవిష్యత్తుపైనే తమ దృష్టి ఉందని చెప్పారు.