టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…మీడియాతో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనపై మాట్లాడుతున్న ఆయన..ఒక్కసారిగా మాట్లాడలేదు. ఏమైందోనని అందరూ అనుకుంటున్నారు..ఒక్క ఐదు నిమిషాలు అంటూ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది.
మూడు రాజధానులంటూ సీఎం చేసిన ప్రకటన, GN RAO ఇచ్చిన నివేదికపై రాజధాని వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. 22 రోజులుగా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అందులో భాగంగా నారా లోకేష్ వారికి మద్దతుగా ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజధానిని అందరూ ఒప్పుకున్నారు..సీఎం జగన్ మోహన్ కూడా ఒప్పుకున్నారని వివరించారు. 30 వేల ఎకరాలు ఉండాలని చెప్పారని, అలాగే చేశామని, ఏమైనా అంటే..గ్రాఫిక్స్ అంటున్నారని..ఒక్కసారైనా రాజధానిలో తిరిగారా ? అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read More : పిన్నెల్లి తొడ గొట్టారు..ఎందుకు రెచ్చగొడుతున్నారు – నారా లోకేష్
అబద్దాలు ఎన్నిసార్లు చెబుతారు…పదేపదే ఎలా మోసం చేస్తారు..ఎంతవరకు న్యాయమో ఆలోచించాలంటూ..ఆయన ఒక్కనిమిషం అంటూ సెలైంట్ అయిపోయారు. ఆ సమయంలో పక్కనున్న మసీదు నుంచి ప్రార్థన వినిపిస్తోంది. ఈ కారణంగా ఆయన మాట్లాడలేదు. ప్రజలందరి మత విశ్వాసాలను, మనోభావాలను గౌరవించగలిగిన వారే నాయకులంటూ టీడీపీ ట్వీట్ చేసింది. ఇది కాస్తా వైరల్ అయితోంది.
రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వ కుట్రలపై మీడియా సమావేశంలో ఆవేశంగా మాట్లాడుతున్న తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఉన్నట్టుండి ప్రసంగాన్ని ఆపేసారు. ఏమిటా అని వింటే మసీదు నుంచి ప్రార్థన వినిపిస్తోంది. ప్రజలందరి మత విశ్వాసాలను, మనోభావాలను గౌరవించగలిగిన వారే అసలైన నాయకులు pic.twitter.com/13r4B7fpan
— Telugu Desam Party (@JaiTDP) January 8, 2020