Nara Lokesh
Nara Lokesh: “జగన్ అండ్ టీమ్ దేవుడి దగ్గర ఆటలు ఆడారు” అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ఇవాళ అమరావతిలో మీడియాతో నారా లోకేష్ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
“దేవుడు ఏమి చేయాలో అది చేశాడు. పరకామణి ఎపిసోడ్‌లో ఒకరోజులో కేసుపెట్టి, ఛార్జ్ షీట్ వేశారు. పరకామణి వ్యవహారంలో త్వరలో సిట్ వేస్తున్నాం. పరకామణి దొంగను అరెస్టు చేయకుండా 41 నోటీసులు ఇచ్చి పంపిం చేశారు. ఇందులో అనేక వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆధారాలు బయటికి వస్తున్నాయి.
నెయ్యి అని చెప్తున్న పదార్థంలో నెయ్యి లేదని సిబిఐ దర్యాప్తులో తేలింది. జగన్ ఐదేళ్ల కాలంలో హిందూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు. ఆయనకు జగన్ టిటిడి చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు?” అని అన్నారు.
“ప్రజా-ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రయివేటు ను భాగస్వామ్యం చేస్తే అది ప్రైవేటీకరణ ఎలా అవుతుంది? సామాన్యుడికి మెరుగైన సేవలు త్వరగా తెచ్చేందుకే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు తీసుకొస్తున్నాం. జగన్ వైద్య కళాశాలలు ఎక్కడ కట్టారు? జగన్ చేయరు, మమ్మల్ని చేయనివ్వం అంటే ఎలా? తన మనుషులకు మాట ఇచ్చిన కాంట్రాక్టులు పోతున్నాయనేది జగన్ ఆందోళనలా ఉంది. మేం ఎక్కడా ఆస్తులు అమ్మటం లేదు” అని తెలిపారు.
జీఎస్టీ సంస్కరణల గురించి లోకేశ్ మాట్లాడుతూ.. “జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్రాలకు తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. మోదీ దూరదృష్టితో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి, ఉత్పత్తి పెరుగుతుంది. పన్నులు కట్టేవారు పెరుగుతారు కాబట్టి అభివృద్ధిలో అంతా భాగస్వాములవుతారు” అని తెలిపారు.