Nara Lokesh: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ధర్నా.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రధాన నగరాల్లో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రోడ్లపైకొచ్చి ఆందోళన చేసిన ఐటీ ఉద్యోగులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేశ్ ..

Nara Lokesh

Nara Lokesh –  Chandrababu Arrest: ఏపీ స్కిల్ డవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు (Chandrababu Naidu Arrest) చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం కుట్రలో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారంటూ టీడీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా రోజుకో కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు చేపడుతూ తమ నిరసన తెలుపుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. చంద్రబాబును అరెస్టు చేయడం సరియైనది కాదంటూ రోడ్లపైకొచ్చి నిరసన తెపుతున్నారు.

Chandrababu Naidu Arrest: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్, బాలకృష్ణ, లోకేశ్.. ఏపీ పాలిటిక్స్‌లో కీలక పరిణామం..

హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్టును తప్పుపడుతూ రోడ్లపైకొచ్చారు. హైదరాబాద్ లోని మదాపూర్, హైటెక్ సిటీ వంటి తదితర ప్రాంతాల్లో పలు ఐటీ కంపెనీల ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి చద్రబాుబ అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేశారు. అయామ్ విత్ సీబీఎన్ అంటూ ప్లకార్డులు చేతబూమి, పెద్దపెట్టున నినాదాలు చేసుకుంటూ చద్రబాబు అరెస్టును ఖండించారు. బెంగళూరులోనూ ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రోడ్లపైకొచ్చి ఆందోళన చేపట్టారు.

Hyderabad IT Employees: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు షాకిచ్చిన పోలీసులు.. అనుమతి లేకుండా అలాచేస్తే కఠిన చర్యలు..

హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రధాన నగరాల్లో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రోడ్లపైకొచ్చి ఆందోళన చేసిన ఐటీ ఉద్యోగులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్, బెంగళూరు, ఇతర నగరాలు మరియు పట్టణాల్లో రోడ్లపైకి వచ్చిన వేలాది మంది ఐటీ ఉద్యోగులకు నేను వనందనం చేస్తున్నాను. మీ చంద్రబాబు నాయుడుపై మీ ప్రేమ, ఆప్యాయతలను బేషరతుగా కురిపించినందుకు మీలో ప్రతిఒక్కరికీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీ అందరికీ ధన్యాదాలు” అంటూ లోకేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.