మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్.. తొలి సంతకం ఏ ఫైలుపై చేశారంటే..

ఏపీ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ నాలుగో బ్లాక్ లోని తన చాంబర్ లో ..

Minister Nara Lokesh

Minister Nara Lokesh : ఏపీ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ నాలుగో బ్లాక్ లోని తన చాంబర్ లో ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేశ్ సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సచివాలయానికి వచ్చిన లోకేశ్ కు పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లోకేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మెగా డీఎస్సీ సంబంధిత ఫైలుపై లోకేశ్ తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధివిధానాలను క్యాబినెట్ ముందుపెట్టే ఫైల్ పై ఆయన సంతకం పెట్టారు

Also Read : Pawan Kalyan : పవన్ గెలుపుని సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్.. అగ్ర నిర్మాత ఆధ్వర్యంలో గ్రాండ్ సెలబ్రేషన్స్..

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్ కు సహచర మంత్రులు వంగలపూడి అనిత, టీజీ భరత్, గుమ్మిడి సంధ్యారాణి, సవిత, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తో పాటు పలువురు టీడీపీ నేతలు, అధికారులు లోకేశ్ కు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.

గతంలో లోకేశ్ కు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే, రాష్ట్రంలో విద్యాశాఖపైనా ప్రభుత్వం ప్ర్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఆ శాఖను బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ శాఖా బాధ్యతలను సీఎం చంద్రబాబు నాయుడు లోకేశ్ కు అప్పగించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు