Nara Lokesh : నవంబర్ 27నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం

సెప్టెంబరు9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.

Nara Lokesh Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra : చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన నారా లోకేష్ తిరిగి ప్రారంభించనున్నారు. ఆయన మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు. నవంబర్ 27నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్రను పున:ప్రారంభం చేయనున్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. డిసెంబరు నెలాఖరు వరకు పాదయాత్ర సాగించే యోచనలో లోకేష్ ఉన్నారు.

విశాఖపట్నంలో పాదయాత్ర ముగించనున్నారు. సెప్టెంబరు9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నారా లోకేష్‌ ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.

Nara Lokesh : పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా? : నారా లోకేష్

నవంబర్ 27న లోకేష్ పొదలాడలో యువగళం పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి పాదయాత్ర చేరుకుంటుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్రను ముగించనున్నారు.

పాదయాత్రకు విరామం ప్రకటించే నాటికి లోకేష్ 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్లు నడిచారు. 9 ఉమ్మడి జిల్లాల్లోని 84 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగింది. పాదయాత్ర సాగిన 84 నియోజకవర్గాల పరిధిలో 66 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. యువత, మహిళలు, రైతులు, ముస్లింలు.. ఇలా వివిధ వర్గాలతో లోకేష్ 11 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు