Nara Lokesh : పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా? : నారా లోకేష్

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావును వైసీసీ రౌడీ మూక దారుణంగా హత్య చేసిందన్నారు.

Nara Lokesh : పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా? : నారా లోకేష్

Nara Lokesh (7)

Updated On : November 19, 2023 / 12:58 AM IST

Nara Lokesh – Jagan : వైసీపీపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నెత్తుటి దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం కొత్తఅంబాపురంలో టీడీపీ నేత పత్తి రామారావును వైసీసీ రౌడీ మూక దారుణంగా హత్య చేసిందన్నారు. వివాద రహితుడైన రామారావును హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

పల్నాడును సస్యశ్యామలం చేయడమంటే రక్తం పారించడమా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. వైసీపీకి రోజులు దగ్గరపడే టీడీపీ కార్యకార్తలపై రోజుకో దాడి, హత్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రామారావు హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామారావు కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Anil Kumar : పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ : అనిల్ కుమార్