Jinnah Tower: మరోసారి తెరపైకి జిన్నాటవర్.. జాతీయ జెండా తొలగింపు

ముగిసింది అనుకున్న గుంటూరు జిన్నా టవర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

Jinnah Tower Controversy: ముగిసింది అనుకున్న గుంటూరు జిన్నా టవర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరుతో గుంటూరు నడిబొడ్డున స్తూపం ఏంటని ప్రశ్నిస్తూ.. పేరును మార్చాలని, లేదంటే తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాలు కూడా అందించి. రిపబ్లిక్ డే సందర్భంగా జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ‘హిందూ వాహిని’ సభ్యులు ప్రయత్నించి అరెస్టు చేశారు కూడా.

అయితే, మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా తొలగించడంతో అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిన్నా టవర్ పేరును అబ్దుల్ కలాం టవర్‌గా మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. టవర్‌పై జాతీయ జెండా ఎగుర వేయాలని ఒత్తిడి చేశారు.

ఇటివలే జెండా దిమ్మెను నగరపాలక సంస్థ ఏర్పాటు చేయగా.. హోంమంత్రితో సహా పలువురు హజరై జాతీయ జెండాను ఎగరేశారు. అయితే, దిమ్మెతో సహా జాతీయ జెండా తొలగించడంతో జెండా ఎందుకు తొలగించారు అనేదానిపై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది.

అయితే, గతంలో చెప్పినట్లుగా జిన్నా టవర్‌కు జాతీయ జెండా రంగులు వేయడమే కాకుండా ఆశోక చక్రం కూడా వేయాలని ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సభ్యులు సూచించడంతో ఆమేరకు పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు