RGV – Perni Nani: సినిమాల్లేక టైంపాస్ కోసం వెళ్లాడు.. ఇదంతా ఐదుగురి గేమ్

మంత్రిని వర్మ కలవడంపై ప్రొడ్యూసర్ నట్టికుమార్ విమర్శలు గుప్పిస్తున్నారు. 'అమ్ముడుపోయిన ఆర్జీవీ.. ఇండస్ట్రీ తరఫున చర్చలకు వెళ్లలేదు.

RGV – Perni Nani: సినిమాల్లేక టైంపాస్ కోసం వెళ్లాడు.. ఇదంతా ఐదుగురి గేమ్

Perni Nani Rgv

Updated On : January 10, 2022 / 2:54 PM IST

RGV – Perni Nani: కొన్ని రోజులుగా ఏపీ సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ, ఏపీ ప్ర్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చలు తెలిసిందే. సినిమా టికెట్ రేట్ల ధరలు బాగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది సినీ ప్రముఖులు, సినీ పరిశ్రమ వ్యక్తులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంట్రవర్సీ డైరక్టర్ ఆర్జీవీ సైతం గొంతు విప్పారు.

అతని వాదన వినేందుకు నేరుగా మంత్రి పేర్ని నాని భేటీకి రెడీ అయ్యారు. వర్మ కూడా తాను ఫిల్మ్ మేకర్ గానే మంత్రిని కలుస్తున్నానని సినీ పరిశ్రమకు ప్రతినిధిగా కాదని చెప్తున్నారు.

మంత్రిని వర్మ కలవడంపై ప్రొడ్యూసర్ నట్టికుమార్ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘అమ్ముడుపోయిన ఆర్జీవీ.. ఇండస్ట్రీ తరఫున చర్చలకు వెళ్లలేదు. ఆర్జీవీ ఇండస్ట్రీతో సంబంధం లేదని చెప్పుకుంటూ చర్చలకు వెళ్లడమేంటి? ఇవన్నీ టైంపాస్ కోసం మాత్రమే. ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. దాని నివేదిక వచ్చేదాకా ఏమీ చేయలేరు’

ఇది కూడా చదవండి: తగ్గేదేలే.. రూ.100 కోట్ల వైపు పుష్ప బాలీవుడ్ కలెక్షన్లు!

‘ఇదంతా ఓ ఐదుగురు కలిసి ఆడుతున్న గేమ్. టికెట్ రేట్లు పెంచేలా ప్రభుత్వాన్ని ఒప్పించి జనాన్ని దోచుకునే ప్లాన్. ఈ చర్చలతో ప్రజలకు, చిన్న సినిమాలకు ఎలాంటి ఉపయోగం లేదు. సినిమాటోగ్రఫీ చట్టాన్ని రద్దు చేయడం పేర్ని నాని చేతుల్లో ఉందా? సీఎం జగన్ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే తీసుకుంటారు. వర్మను, వర్మ సినిమాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వర్మకు సినిమాలు లేక ఖాళీగా ఉండి కార్పొరేట్ కంపెనీల కోసమే వెళ్తున్నా’డంటూ విమర్శలు గుప్పించారు.