Prakasam
Prakasam : ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. వ్యవసాయ పనినిమిత్తం కూలీలను పిలిచేందుకు వెళ్లిన మహిళను ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారు నాటు వైద్యుడు.. అనంతరం ఆమె కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి అలియాస్ విజయ వ్యవసాయ పనుల కోసం కూలీలను పిలిచేందుకు రాత్రి సమయంలో వుడ్డెపాలెం వెళ్లారు.
చదవండి : Lalitpur Minor Rape..ఎస్పీ,బీఎస్పీ నేతలు అరెస్ట్
వ్యవసాయ పనుల కోసం కూలీలను పిలుస్తుండగా వల్లెపు ఓబయ్య అనే నాటు వైద్యుడు ఆమెను గమనించాడు. మోకాళ్ళ నొప్పులకు నాటు మందు ఇస్తానని ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బయట చెబుతుందని కాళ్ళు చేతులు కట్టేసి గొడ్డలితో నరికి హత్యచేశాడు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి.. హత్య విషయం కుటుంబ సభ్యులకు తెలిపాడు ఓబయ్య.. దీంతో వారు జరుగుమల్లి పోలీసులకు సమాచారం అందించారు.
చదవండి : Doctor Rape : దారుణం… బర్త్‌డే పార్టీకి పిలిచి మహిళా డాక్టర్‌పై అత్యాచారం
సిబ్బందితో కలిసి ఘటన స్థలికి వచ్చిన ఎస్ఐ రజియా సుల్తానా బేగం నిందితుడు ఓబయ్యను కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కారును అడ్డుకున్న పోలీసులు నిందితుడు ఓబయ్యను కిందకు దింపి కర్రలతో కొట్టి హత్యచేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీస్ బలగాలను మోహరించారు.
చదవండి : Gang Rape: భర్తకు యాక్సిడెంటైందని చెప్పి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు