Tiruchanur Temple: 50 ఏళ్ల తరువాత తిరుచానూరులో “నవకుండాత్మక శ్రీ‌యాగం”

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 50 సంవత్సరాల తరువాత "నవకుండాత్మక శ్రీ‌యాగాన్ని" నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు.

Tiruchanur Temple: ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆల‌యంలో శుక్ర‌వారం నవకుండాత్మక శ్రీయాగం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు జ‌రుగ‌నున్న శ్రీ‌యాగాన్ని ఆలయ అర్చకులు.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతుల చేతులమీదుగా శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9. 30 గంటలకు సంకల్పంతో యాగం ప్రారంభమైంది. మ‌ధ్యాహ్నం 1 గంట వ‌రకు యాగశాలలో సంకల్పం, హోమాలు, చ‌తుష్టానార్చ‌న‌, అగ్ని ప్ర‌తిష్ట‌, నిత్య‌పూర్ణాహుతి, నివేద‌న‌, వేద విన్న‌పం, మ‌హామంగ‌ళ‌హార‌తి నిర్వ‌హించారు. సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టానార్చ‌న‌, శ్రీ‌యాగం హోమాలు, ల‌ఘుపూర్ణాహుతి, మ‌హానివేద‌న‌, వేద విన్న‌పం, మ‌హామంగ‌ళ‌హార‌తి చేపట్టి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌ను స‌న్నిధిలోకి వేంచేపు చేస్తారు.

Also read: Medaram : మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర.. ఎప్పటి నుంచి అంటే

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 50 సంవత్సరాల తరువాత “నవకుండాత్మక శ్రీ‌యాగాన్ని” నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుబ్బారెడ్డి దంపతులు 34 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా ఇచ్చారు. అర్చకులు అమ్మవారి ఉత్సవ మూర్తికి ఈ హారాన్ని అలంకరించారు. జనవరి 27వ తేదీ వరకు యాగం నిర్వహిస్తారు.

Also read: Amar Jawan Torch: అమర్ జవాన్ జ్యోతిని ఆర్పడం లేదు, తరలిస్తున్నాం అంతే: కేంద్రం

కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో అర్చ‌కులు వేంపల్లి శ్రీ‌నివాస‌న్ ఆధ్వ‌ర్యంలో ఏకాంతంగా ఈ శ్రీయాగాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. శ్రీవేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ యాగాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఏఈవో ప్రభాకర్ రెడ్డి అర్చకులు బాబు స్వామి పాల్గొన్నారు.

Also read: Ganjayi Smuggling: రూ.1.80 కోట్ల విలువచేసే 800 కిలోల గంజాయి స్వాధీనం

ట్రెండింగ్ వార్తలు