Rotten Chicken And Meat : వామ్మో.. ఈ చికెన్ తింటే ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే..! నెల్లూరులో మళ్లీ కుళ్లిన మాంసం కలకలం

నెల్లూరులో చికెన్ సెంటర్లపై హెల్త్ ఆఫీసర్ల దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కుళ్లిన మాంసం విక్రయిస్తున్నట్లు బయటపడింది. వంద కేజీల చికెన్ తో పాటు కోడి వ్యర్థాలను స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించారు.

Rotten Chicken And Meat : నెల్లూరులో చికెన్ సెంటర్లపై హెల్త్ ఆఫీసర్లు మరోసారి దాడులు చేశారు. ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కుళ్లిన మాంసం విక్రయిస్తున్నట్లు బయటపడింది.

వెంకటేశ్వరపురంలోని బిస్మిల్లా చికెన్ స్టాల్ లో రెండు ఫ్రీజర్లలో కొన్ని రోజులుగా నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు అధికారులు. వంద కేజీల చికెన్ తో పాటు కోడి వ్యర్థాలను స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించారు. చికెన్ సెంటర్ ను అధికారులు సీజ్ చేశారు. ఫినాయిల్ పోసి ఆ చికెన్ ను నిర్వీర్యం చేశారు.

Also Read : Milk Adulteration : ఈ పాలు తాగితే పైకి పోవాల్సిందే.. యూట్యూబ్‌లో చూసి యూరియా, ఆయిల్‌తో కల్తీ పాలు తయారీ

చెన్నై, చిత్తూరు నుంచి మాంసం తీసుకొచ్చినట్లు గుర్తించారు. కొంతమంది స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో దాడులు చేసినట్లు హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తెలిపారు. తరుచూ చికెన్ షాపులపై అధికారులు దాడులు చేస్తున్నా.. వ్యాపారుల్లో మార్పు రాకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సాధారణంగా సండే వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్‌ ప్రియులు చికెన్ షాపుల ముందు బారులు తీరుతుంటారు. ఈ డిమాండ్ ను చూసి.. కొందరు వ్యాపారులు దారుణాలకు ఒడిగడుతున్నారు. కుళ్లిన చికెన్ ను కూడా అమ్మి కాసులు దండుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కుళ్ళిన మాంసాన్ని నిల్వ ఉంచి మరీ కస్టమర్లకు అమ్మేస్తున్నారు. ఈ విషయాలేమీ తెలియని అమాయకులు ఆ కుళ్ళిన చికెన్ ను తీసుకుని తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని మాంసపు దుకాణాల్లో కుళ్లిన కోడి మాంసం విక్రయాలు తరుచుగా బయటపడుతున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కొన్ని రోజుల క్రితం కూడా అధికారుల తనిఖీల్లో భారీ స్థాయిలో కుళ్లిన చికెన్ పట్టుబడింది. చెన్నై నుంచి కోడి మాంసంతో పాటు కోడి లివర్ తరలిస్తున్న వాహనంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా చెన్నై నుంచి దిగుమతి చేస్తున్న 300 కిలోల కోడి లివర్ మాంసాన్ని సీజ్ చేశారు. ఆ మాంసం, లివర్ కుళ్లిపోయి ఉన్నాయి. ఆరిఫ్ అనే వ్యాపారి ఈ కుళ్లిన చికెన్ ను చెన్నైలో కొనుగోలు చేశాడు.

Also Read : Nellore Rotten Chicken : ఈ చికెన్ తింటే చిక్కులే.. నెల్లూరులో కుళ్లిన చికెన్ విక్రయాలు, తనిఖీల్లో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు

ఇలా నిత్యం ఎక్కడో ఒకచోట తనిఖీలు చేస్తున్నా కొందరు వ్యాపారుల తీరు మాత్రం మారడం లేదు. చర్యలు తీసుకుంటున్నా.. మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన కుళ్లిన చికెన్ విక్రయాల వ్యవహారం చికెన్ ప్రియుల వెన్నులో వణుకు పుట్టించింది. ఇన్నాళ్లూ తాము తిన్నది ఆరోగ్యకరమైనదో కాదోనని వర్రీ అవుతున్నారు.