Milk Adulteration : ఈ పాలు తాగితే పైకి పోవాల్సిందే.. యూట్యూబ్‌లో చూసి యూరియా, ఆయిల్‌తో కల్తీ పాలు తయారీ

యూట్యూబ్ చూసి యూరియా, ఆయిల్ తో కల్తీ పాలు తయారు చేస్తున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Milk Adulteration : ఈ పాలు తాగితే పైకి పోవాల్సిందే.. యూట్యూబ్‌లో చూసి యూరియా, ఆయిల్‌తో కల్తీ పాలు తయారీ

Milk Adulteration : డబ్బు కోసం కొందరు వ్యక్తులు దిగజారిపోతున్నారు. ఆహార పదార్ధాలను సైతం కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. సాధారణంగా పాలు తాగితే బలం అంటారు డాక్టర్లు. పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. ఇందులో నిజం లేకపోలేదు. అయితే, ఈ పాలు తాగితే మాత్రం.. ఆరోగ్యం సంగతి దేవుడెరుగు.. కచ్చితంగా అనారోగ్యం పాలవడం, జబ్బుల బారిన పడటం ఖాయం. అంతేనా.. ఈ పాలు తాగితే ఏకంగా పైకి పోవడం కూడా గ్యారంటీ. ఎందుకంటే అవి పాల రూపంలో ఉన్న విషం. తెల్లని పాలలాగే కనిపించే కల్తీ పాలు.

ఏలూరు జిల్లాలో కల్తీ పాల తయారీ కలకలం రేపింది. లింగపాలెం మండలం పాశ్చానగరం గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. కొంతకాలంగా మంగయ్య అనే వ్యక్తి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కల్తీ పాల తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్న మంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కల్తీ పాల తయారీకి వినియోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Theft In Gold Shop : OMG.. చీరను అడ్డం పెట్టుకుని జస్ట్ 20 సెకన్లలో రూ.10లక్షల గోల్డ్ నెక్లెస్‌ను ఎలా కొట్టేసిందో చూడండి..

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు యూట్యూబ్ చూసి యూరియా, ఆయిల్ తో కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మంగయ్య లాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

యూరియా, ఆయిల్ కలిపి నిందితుడు మంగయ్య కల్తీ పాలు తయారు చేస్తున్నాడు. కల్తీ పాల తయారీ విధానాన్ని పోలీసులకు చేసి చూపించాడు మంగయ్య. కళ్ల ముందే పాల తయారీ చూసిన పోలీసులు కంగుతిన్నారు. అతడు చేసిన కల్తీ పాలు.. అచ్చం పాలలానే ఉన్నాయి. అవి నిజం పాలే అని అనుకోవడం ఖాయం. కల్తీ పాలు అనే డౌట్ రాదు. ఆ రేంజ్ లో మనోడు కల్తీ పాలను తయారు చేశాడు.

Also Read.. Adulterated milk : కల్తీ పాలను గుర్తించడం ఎలా..? కల్తీ పాల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?

వాస్తవానికి పాల కోసం పశువులను పెంచాలి. ఆవులు లేదా గేదెలను పెంచుకోవాలి. కానీ, మంగయ్య దగ్గర ఒక్క పశువు కూడా లేదు. అయినా లీటర్ల కొద్దీ పాలు తీసుకెళ్లి మార్కెట్ లో విక్రయిస్తున్నాడు. ముందుగా అతడు రైతుల దగ్గర వంద లీటర్ల పాలు కొంటాడు. మిల్క్ పౌడర్, ఆయిల్, యూరియా మిక్స్ చేసి ఆ పాలను రెండు వందల లీటర్లు చేస్తాడు. ఆ తర్వాత విక్రయిస్తాడు. కొనేది కొన్ని పాలు మాత్రమే, మరి అన్ని లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే దానిపై చుట్టుపక్కల వాళ్లకు డౌట్ వచ్చింది. ఆరా తీయగా.. మైండ్ బ్లాంక్ అయ్యే నిజం తెలిసింది. యూరియా, ఆయిల్ సాయంతో అతడు ఇంట్లోనే కల్తీ పాలు తయారు చేస్తున్నాడని తెలిసి షాక్ అయ్యారు.

మంగయ్య చేసే మోసం వివరాలను పోలీసులు వెల్లడించారు. ” మంగయ్య బయటి నుంచి వంద లీటర్ల పాలు కొంటాడు. దాన్ని 200 లీటర్లుగా మారుస్తాడు. అలా తయారు చేసిన పాలలో చిక్కదనం కానీ ఫ్యాట్ కానీ ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటాడు. ఆ కల్తీ పాలను పాల కేంద్రానికి తరలిస్తాడు. మిల్క్ పౌడర్, ఫ్యాట్ కంటెంట్ పెరగడం కోసం ఆయిల్, కొద్దిగా యూరియా మూడూ కలిపి మిక్సీలో ఆడిస్తాడు. ఆ తర్వాత వచ్చిన పేస్ట్ కి వాటర్ యాడ్ చేస్తాడు. దాన్ని పాలకు కలిపి ఓవరాల్ గా కల్తీ పాలు తయారీ చేస్తాడు” అని పోలీసులు వివరించారు.

Also Read.. Honey : మార్కెట్లో కొనుగోలు చేస్తున్న తేనె అసలో, నకిలీనో కనిపెట్టటం ఎలాగంటే ?

మంగయ్య చేస్తున్న మోసం గురించి తెలిశాక స్థానికులు విస్తుపోతున్నారు. మరీ ఇంత మోసమా అని మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ తాము తాగింది పాలా? కల్తీ పాలా? అనేది అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. కల్తీ పాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే మంగయ్య లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి తప్పు చేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.