Honey : మార్కెట్లో కొనుగోలు చేస్తున్న తేనె అసలో, నకిలీనో కనిపెట్టటం ఎలాగంటే ?

స్వచ్ఛమైన తేనె నీటిలో కరగదు. నీటిలో తేనెను వేసి చూడండి. వెంటనే నీటిలో కరిగిపోతే మాత్రం అది చక్కెర ద్రావణమే. అసలైన తేనె నీటిలో వేసినా దానికుండే సహజ గుణాలను కోల్పోదు.

Honey : మార్కెట్లో కొనుగోలు చేస్తున్న తేనె అసలో, నకిలీనో కనిపెట్టటం ఎలాగంటే ?

Honey :

Honey : మార్కెట్‌ మొత్తం కల్తీల మయంగా మారిపోయింది. ఏది అసలో, ఏది నకిలీనో గుర్తించటం చాలా కష్టతరంగా తయారైంది. ముఖ్యంగా రోజువారిగా ఉపయోగించే తేనె విషయంలో ఇదే పరిస్ధితి నెలకొంది. అనేక బ్రాండ్లు ప్రస్తుతం మార్కెట్ ను ముంచెత్తున్నాయి. వాటిలో ఉండే తేనె అసలా, నకిలీనో తెలియక జనం తికమక పడుతున్నారు. స్వచ్ఛమైన తేనె ఎన్నిరోజులైనా పాడవదు. అంతేకాక అందులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. కానీ కల్తీ తేనె వాడటం వల్ల అవి త్వరగా పాడవటంతోపాటు, ఆరోగ్యంపైను దుష్ప్రభావాన్ని చూపిస్తాయి.

తేనె అసలుదో, నకిలీదో  నిర్ధారణ చేయటం ఎలాగంటే ;

1. మార్కెట్లో లభించే తేనె ఏ కోవకు చెందిందో నిర్ధారించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి.. మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తేనె డబ్బాలోని రెండు, మూడు చుక్కలను తీసుకొని దానిని వెనిగర్ నీటిలో వేయాలి. వెనిగర్ వాటర్ లో ఉన్న ఆ తేనె నురుగులు వస్తే మాత్రం అది కలుషితమైనదిగా గుర్తించవచ్చు.

2. స్వచ్ఛమైన తేనె నీటిలో కరగదు. నీటిలో తేనెను వేసి చూడండి. వెంటనే నీటిలో కరిగిపోతే మాత్రం అది చక్కెర ద్రావణమే. అసలైన తేనె నీటిలో వేసినా దానికుండే సహజ గుణాలను కోల్పోదు. అది కరిగేందుకు కొద్ది సమయం పడుతుంది.

3. స్వచ్ఛమైన తేనెలో, ఈగ పడిపోవడం వల్ల చిక్కుకుపోదు. తిరిగి ఎగిరిపోతుంది. స్వచ్ఛమైన తేనెను కళ్లకు రాసుకుంటే కొంచెం మంటగా ఉంటుంది. దుస్తుల పైన పడినా మరకలు కనిపించవు.

4. తేనె డబ్బాలో ఒక దూది ముక్కను ముంచాలి. దానిని అగ్గిపుల్లతో వెలిగించాలి. వెంటనే మండితే అది స్వచ్ఛమైనదిగా అలా మండకుండా ఉంటే మాత్రం అది నకిలీదిగా గుర్తించాలి.