Nellore YCP : నెల్లూరులో వైసీపీకి బిగ్‌షాక్‌.. టీడీపీలోకి క్యూకట్టిన నేతలు

నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లు, నుడా మాజీ చైర్మన్ టీడీపీలో చేరారు.

Nellore YCP : నెల్లూరులో వైసీపీకి బిగ్‌షాక్‌.. టీడీపీలోకి క్యూకట్టిన నేతలు

Nara lokesh

Updated On : September 19, 2024 / 1:16 PM IST

Nellore YCP : నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లు, నుడా మాజీ చైర్మన్ టీడీపీలో చేరారు. వీరితోపాటు మరో 50మంది వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారికి ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Also Read : జనసేన పార్టీలో బాలినేని చేరికకు లైన్ క్లియర్.. టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ కీలక హామీ

టీడీపీలో చేరిన కార్పొరేటర్లలో.. 3వ వార్డు కార్పోరేటర్ సంక్రాంతి అశ్విని, 4వ వార్డు కార్పోరేటర్ పి.ప్రత్యూష, 5వ వార్డు కార్పోరేటర్ ఓ.రవిచంద్ర, 6వ వార్డు కార్పోరేటర్ ఎమ్.మస్తానమ్మ, 9వ వార్డు కార్పోరేటర్ దామవరపు రాజశేఖర్, 10వ వార్డు కార్పోరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్, 11వ వార్డు కార్పోరేటర్ గోతం అరుణ, 14వ వార్డు కార్పోరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, 15వ వార్డు కార్పోరేటర్ జి.వెంకటేశ్వర్ రెడ్డి, 16వ వార్డు కార్పోరేటర్ వి.శ్రీకాంత్ రెడ్డి, 47వ వార్డు కార్పోరేటర్ పొట్లూరు రామకృష్ణ, 48వ వార్డు కార్పోరేటర్ షేక్ ఇంతియాజ్, 49వ వార్డు కార్పోరేటర్ వి.రాజేశ్వరి, 51వ వార్డు కార్పోరేటర్ కాయల సాహిత్య, 54వ వార్డు కార్పోరేటర్ షేక్ సఫియా బేగం, కో-ఆప్షన్ మెంబర్ షేక్ జమీర్ టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు.