దువ్వాడ కుటుంబ వివాదంలో కొత్త టర్న్..! వాణి కీలక వ్యాఖ్యలు

నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్దవాళ్లం తప్పు చేస్తే పిల్లల మీద ప్రభావం పడుతుంది.

Duvvada Family Dispute : దువ్వాడ కుటుంబ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. దువ్వాడ వాణి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను, తన భర్త, తన పిల్లలు అందరూ కలిసి శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోనే ఉండాలని తన ఆశ అని ఆమె చెప్పారు. తనకు కానీ తన పిల్లలకు కానీ ఒక్క రూపాయి కూడా వద్దన్నారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ పిల్లలను చూసుకుంటే చాలన్నారు. తప్పుడు పనుల వల్ల పిల్లల మీద ప్రభావం పడుతుందని వాణి వాపోయారు. నాకు ఆస్తుల కావాలి, రాజకీయ ఆకాంక్ష ఉంది అంటూ తన భర్త శ్రీనివాస్ టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నారని వాణి ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఇల్లు రాయమనో, పిల్లల పేరు మీద ఆస్తులు రాయమనో నేను ఏ రోజూ అడగలేదు. నాకు కూడా ఒక్క రూపాయి ఇవ్వద్దు. ఆయన పిల్లలను చూసుకుంటే చాలు. ఈ ఇంట్లో ఎలాంటి చెడు చెయ్యకూడదని కోరుకుంటున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్దవాళ్లం తప్పు చేస్తే పిల్లల మీద ప్రభావం పడుతుంది. ఎక్కడైనా బయటకు వెళ్లి ఎలాగున్నా నాకు ప్రాబ్లమ్ లేదు.

ఇంట్లో మాత్రం అలాంటి పనులు చేయకూడదు అనేది నా ఉద్దేశం. మాకు ఒక్క రూపాయి ఇవద్దు, మా పేరున ఒక్క ఆస్తి కూడా రాయొద్దు. నాకు ఆస్తులపైన, రాజకీయాలపైన ఆకాంక్ష లేదు. అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉందాం. పిల్లల కోసం ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. లిఖితపూర్వకంగా రాసి ఇవ్వమన్నా ఇస్తాను. ఆయన ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు. బయటకు వెళ్లి ఆయన ఎలా బిహేవ్ చేసినా నాకు అభ్యంతరం లేదు” అని దువ్వాడ వాణి అన్నారు.

Also Read : ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్‌ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?

ట్రెండింగ్ వార్తలు