family suicide in nandyal: కర్నూలు జిల్లా నంద్యాలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త మలుపు తిరిగింది. పోలీసుల వేధింపులతోనే అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నంద్యాల వన్‌టౌన్ సీఐ సోమశేఖరరెడ్డి కొన్నాళ్లుగా అబ్దుల్ సలాంను వేధిస్తున్నట్టు తెలిపారు. సోమవారం రాత్రి కూడా అబ్దుల్‌కు సీఐ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు. దీంతో భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు తెలిపారు.
అబ్దుల్ సలాం నిమిషాంబ జువెలర్స్‌లో పనిచేసేవాడు. సంవత్సరం క్రితం జువెలరీలో చోరీ జరిగింది. అబ్దుల్ సలామే చోరీకి పాల్పడినట్టు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అబ్దుల్ జైలుకి కూడా వెళ్లొచ్చాడు.