Vizag Fake IAS: నకిలీ ఐఏఎస్ జంట కేసులో కొత్త ట్విస్ట్… చివరకు అద్దెకు ఉంటున్న ఇంటిలోనూ..

వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్ లు భార్యాభర్తలు. వీరిద్దరూ నకిలీ ఐఏఎస్ ల అవతారమెత్తి మోసాలకు పాల్పడ్డారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి..

Vizag Fake IAS

Vizag Fake IAS: ఈజీగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. చివరికి సమాజంలో ఎంతో గౌరవమైన ఐఏఎస్ పదవినిసైతం తమ అవసరాలకోసం వాడుకుంటున్నారు. నకిలీ ఐఏఎస్ లమంటూ అమాయకుల వద్ద దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనే విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ నకిలీ ఐఏఎస్ లుగా అవతారమెత్తి మోసాలకు పాల్పడ్డారు. వీరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. వారి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: తెల్లగా అవుతామని అమ్మాయిలు బలపాలు తెగ తినేస్తున్నారట..

వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్ లు భార్యాభర్తలు. భర్త జీవీఎంసీ కమిషనర్ గా, భార్య హెచ్ఆర్సీ జాయింట్ కలెక్టర్ గా అవతారమెత్తి మోసాలకు పాల్పడ్డారు. వీరిద్దరూ టిడ్కో ఇళ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను మోసాలకు పాల్పడ్డారు. విశాఖలో ఐఏఎస్ గా చలామణి అవుతున్న ఫేక్ ఐఏఎస్ జంటను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానంలో వారిని హాజరుపర్చగా.. ఇద్దరికీ 15రోజులు రిమాండ్ విధించారు. టిడ్కో ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు అడుగుతుంటే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ నకిలీ ఐఏఎస్ జంట మోసాలపై ఆరాతీయగా ఒక్కొక్కటిగా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: అడవిలో డబ్బుల డంప్ దొరికింది.. నేను ఒక్కడినే తీసుకుంటే మంచిది కాదని వీడు ఏం చేశాడో చూడండి..

టిడ్కో ఇళ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను వంగవేటి భాగ్య రేఖ అలియాస్ అమృత, మన్నెందొర చంద్రశేఖర్ లు మోసాలకు పాల్పడ్డారు. టిడ్కో ఇల్లు ఇప్పిస్తామని పలువురు దగ్గర లక్షలు వసూలు చేశారు. అడిగితే తిరిగి కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. జీవీఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్నాని నకిలీ ఐడి కార్డు తయారు చేసుకొని భర్త దందా కొనసాగించగా.. హెచ్ఆర్సీ డిపార్ట్మెంట్ లో జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నానని భార్య మోసాలకు పాల్పడింది. చివరకు వీరు అద్దెకు ఉంటున్న ఇంటినిసైతం కబ్జాచేసి ఆక్రమించుకున్నారు.

వీరిపై ఎంవీపీ, కంచరపాలెం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విశాఖతోపాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ నకిలీ ఐఏఎస్ జంట మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు ఎవరు ఉన్నా ఫిర్యాదు చేయాలని విశాఖ సీపీ కోరారు.