తెల్లగా అవుతామని అమ్మాయిలు బలపాలు తెగ తినేస్తున్నారట..
ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న కొందరు యువతులు అందం వస్తుందని బలపాలను తెగతినేస్తున్నారట. దీంతో ఆ ప్రాంతంలో బలపాల విక్రయాలు భారీగా పెరిగాయట.

Slate pencil eating
Slate pencil eating: యువతులు, మహిళలు అందంగా ఉండేందుకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. అందంగా కనిపించేందుకు పలురకాల క్రీములు వాడుతుంటారు. మరికొందరు బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తారు. మార్కెట్లో పలు బ్యూటీ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుతూ అందంగా కనిపించేందుకు యువతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, కోదాడ పట్టణంలో కొందరు యువతులు బలపాలు తినేసి అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారట. అంతేకాదు.. బ్రాండ్లు అడిగి మరీ కొనుగోలు చేస్తున్నారట. దీంతో ఆ ప్రాంతంలో బలపాల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇంతకీ ఏంటి ఈ బలపాల గోల.. అవితింటే నిజంగా అందం పెరుగుతుందా.. వాటిని తినడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
చిన్నతనంలో బడికి వెళ్లిన ప్రతిఒక్కరూ.. ఏదోఒక సమయంలో బలపాలు తింటూ అమ్మ చేత, అక్కలచేత, బడుల్లో టీచర్ల చేత తిట్లుతిన్నవారమే. ప్రస్తుతం చాలా స్కూళ్లలో బలపాలతో పనిలేకుండా పోయింది. పెన్షిల్ తోనే ప్రస్తుతం పిల్లల చదువులు మొదలవుతున్నాయి. పలకా, బలపం అనే కాన్సెప్ట్ చాలా స్కూళ్లలో కనిపించదు. అయితే, ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిలు బలపాలు తెగతినేస్తున్నారట. సరదాగా తినడమేకాదు.. వాటికి బానిసలుగా మారిపోతున్నారట. బ్రాండ్లు ఎంచుకొని మరి కొనుగోలు చేస్తున్నారట. దీంతో బలపాల విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ విచిత్రం ఎక్కడో కాదు.. కోదాడ ప్రాంతంలో. దీంతో ఆ ప్రాంతంలో బలపాల విక్రయాలు పెరిగాయని తెలుస్తుంది.
Also Read: అడవిలో డబ్బుల డంప్ దొరికింది.. నేను ఒక్కడినే తీసుకుంటే మంచిది కాదని వీడు ఏం చేశాడో చూడండి..
బలపాలను సుద్దతో (క్యాల్షియం కార్బొనెట్)తో తయారు చేస్తారు. ఇవి తింటే తెల్లగా అవుతామని ఢిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న చాలామంది విద్యార్థినీలు భావిస్తున్నారట. బలపాలు తింటే తెల్లగా అవుతారన్న ప్రచారం ఎక్కువకావడంతో చాలా మంది యువతులు బలపాలను డబ్బాలకు డబ్బాలు కొనుగోలు చేసుకొని తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే, బలపాలు అతిగా తినేవారిని తేలిగ్గా గుర్తించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. సుద్దలో క్యాల్షియం కార్బొనెట్ తో పాటు స్వల్ప మోతాదులో కాడ్మియం, లెడ్ వంటి రసాయనాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల బాలికల్లో రక్తహీనత ఏర్పడి మొఖం పాలిపోయినట్లుగా తయారవుతుంది. దీనికితోడు పెదాలు నలుపు రంగంలోకి మారుతాయి. మొఖం పాలిపోయినట్లుగా తెల్లగా అవ్వటాన్నే కొందరు యువతులు అందం అని భ్రమపడుతున్నారు.
బలపాలు తింటే వచ్చే అనారోగ్య సమస్యలు..
కొందరు వైద్యులు సూచనల ప్రకారం.. బలపాలు తినడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది.
ముఖం పాలిపోయినట్లు మారుతుంది. పెదాలు నలుపు రంగులోకి మారుతాయి.
ఆకలి మందగించడంతోపాటు ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపరు.
బలపాలు కంటిన్యూగా తింటుంటే సంతాన లేమి వంటి సమస్యలు కూడా వస్తాయి.
బలపాలు తినేవారిలో కొంత ఆత్మన్యూనతా భావం కూడా కనిపిస్తుంది.
బలపాలు తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి.
మానుకోలేని పరిస్థితికి చేరితే కౌన్సిలింగ్ ద్వారా బలపాలు తినే అలవాటు మాన్పించాలి.
సుదీర్ఘకాలం బలపాలు తింటుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.