Chandrababu Naidu
Happy New Year 2025: ఏపీ వ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలు అంబరాన్నితాకాయి. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి 1గంట వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు న్యూఇయర్ వేడుకల్లో సందడి చేశారు. డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ.. బాణాసంచా పేలుళ్ల మధ్య 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించారు. అర్ధరాత్రి వేళ కేక్ లు కట్ చేసి న్యూఇయర్ వేడుకల ఘనంగా జరుపుకున్నారు. యువత రోడ్లపైకి వచ్చి న్యూఇయర్ శుభాకాంక్షలు చెబుతూ.. బైక్ లపై చక్కర్లు కొడుతూ సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టిన వేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా ప్రత్యేక వీడియోను షేర్ చేసి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read: Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ 16 సార్లు నూతన సంవత్సర వేడుకలు.. ఎలాగంటే?
‘‘రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, ఆశలు ఆశయాలూ తీర్చే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర పునర్ నిర్మాణానికి అంకితం కావాలని కోరుకుంటూ అందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.’’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Free Bus Ride Scheme : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..! ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే..
ఇదిలాఉంటే.. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం 11గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయాలనికి వెళ్లనున్నారు. సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలో ఉండనున్నారు. అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప దినాలు దృష్ట్యా న్యూఇయర్ శుభాకాంక్షలకోసం బొకేలు, శాలువాలు తేవొద్దని, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా వద్దని నేతలకు చంద్రబాబు సూచించారు. అయితే, మధ్యాహ్నం 12.15గంటల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ దుర్గగుడికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రజలు నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, ఆశలు ఆశయాలూ తీర్చే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర పునర్ నిర్మాణానికి అంకితం కావాలని కోరుకుంటూ అందరికి నూతన ఆంగ్ల సంవత్సర… pic.twitter.com/fH8uDsVjjr
— N Chandrababu Naidu (@ncbn) January 1, 2025