AP Night Curfew : ఏపీలో నైట్ కర్ఫ్యూ ప్రారంభం.. అవవసరంగా బయటకు వెళ్తే చర్యలు

రాత్రి 11 గంటలకు నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో అనవసరంగా బయటకు వెళ్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు.

AP Night Curfew : ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నైట్ కర్ఫ్యూ విధించింది. సోమవారం(జనవరి 10) రాత్రి 11 గంటలకు నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో అనవసరంగా బయటకు వెళ్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. రాత్రి 11 గంటలకు ముందే ఇళ్లకు చేరుకోవాలి. పనులన్నీ వేగంగా ముగించుకుని రాత్రివేళ బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాలి.

ICICI Credit Card : క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన ఛార్జీలు

మరోవైపు రాత్రి కర్ఫ్యూకి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేయనుంది.

* ప్రజలంతా మాస్కులు ధరించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
* మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలి.
* కొవిడ్‌ నివారణ చర్యలను సమర్థంగా అమలు చేయాలి.
* 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడపాలి.
* థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలి.
* వ్యాపార సముదాయాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
* బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలి.
* బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి.. ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదు

మరోవైపు ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. కాగా, నిన్నటి (1257)తో పోలిస్తే కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 984 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనాతో ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదు. గడిచిన 24 గంటల్లో 24వేల 280 శాంపిల్స్ పరీక్షించారు. నిన్న ఒక్కరోజే 152 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,16,30,231 శాంపిల్స్ పరీక్షించారు.

Curry Bananas : కూర అరటిలో ఫైబర్ అధికం…బరువు తగ్గటం ఖాయం

తాజాగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 244 కేసులు వెలుగుచూశాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. విశాఖలో 151 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 117 కేసులు రికార్డ్ అయ్యాయి.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,82,843. రాష్ట్రంలో మొత్తం 5వేల 606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,732 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 505గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు