Curry Bananas : కూర అరటిలో ఫైబర్ అధికం…బరువు తగ్గటం ఖాయం

పచ్చి అరటికాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి మంచి బ్యాక్టీరియా అందుతుంది.

Curry Bananas : కూర అరటిలో ఫైబర్ అధికం…బరువు తగ్గటం ఖాయం

Kura Arati

కూర అర‌టికాయ‌లు తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వీటితో రుచికరమైన కూరలు తయారుచేసుకుంటారు. కూర అర‌టికాయ‌ల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు ఉన్నాయి. పచ్చి అరటికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. సాధార‌ణ అర‌టి పండ్ల క‌న్నా కూర అర‌టి కాయ‌ల్లో ఎక్కువ‌గా ఫైబ‌ర్ ఉంటుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు ఉండవు. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపటంలో దోహదపడుతుంది.

శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా చూడటంలో కూర అరటి బాగా ఉపకరిస్తుంది. సాధార‌ణ అర‌టి ఉండేవిధంగానే కూర అర‌టి కాయ‌ల్లోనూ పొటాషియం అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల హైబీపీ తగ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించ‌వ‌చ్చు. గుండె జ‌బ్బులు తో బాధపడుతున్నవారు కూర అర‌టికాయ‌ల‌ ఆహారంలో భాగం చేసుకోవటం మంచిది.

నాడీవ్యవస్థను చురుగ్గాపనిచేయడానికి , కండరాల వ్యవస్ధను బలోపేతం చేసేందుకు , కిడ్నీలలో రక్తం శుద్ధి పరచటంలో బాగా ఉపయోగపడుతుంది. కూర అర‌టి కాయ‌ల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. పొటాషియం, విట‌మిన్ సి, బి6 పుష్కలంగా లభిస్తాయి. ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక కూర అర‌టికాయ‌ల‌తో బ‌రువు సుల‌భంగా త‌గ్గ‌వ‌చ్చు. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఇవి మంచి ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి కూర అరటి మంచి ఆహారం. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

పచ్చి అరటికాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి మంచి బ్యాక్టీరియా అందుతుంది. ఇర్రిట‌బుల్ బ‌వెల్ సిండ్రోమ్‌, మ‌ల‌బద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ అర‌టికాయ‌ల‌ను ఉడ‌క‌బెట్టి అందులో కొద్దిగా ఉప్పు క‌లుపుకుని తింటే మంచిది. దీంతో ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

పచ్చి అరటిపండ్లు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. తద్వారా బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. పచ్చి అరటి పండ్లలో ఉండే స్ట్రార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వచేరకుండా, ఇన్సులిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది. ప్లాస్మా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది. పచ్చిఅరటిపండ్ల డయేరియా తగ్గించడంలో వికారం, వాంతులు, అలసట, పొట్ట ఉదరంలో నొప్పిని తగ్గిస్తుంది. పచ్చి అరటిపండ్లలో విటమిన్స్, మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.