పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో ఆరు గ్రామాల్లో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడారు. జగన్ విధ్వంసంతో గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వాసితులను ఆదుకోవడం కూడా తమ ప్రభుత్వానికి అంతే ముఖ్యమని నిమ్మల రామానాయుడు చెప్పారు. నాడు 2017లో నిర్వాసితులకు రూ.800 కోట్లు ఇచ్చి, నేడు మరో రూ.1000 కోట్లను చంద్రబాబు నాయుడు పంపిణీ చేయించారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క పునరావాస కాలనీనీ నిర్మించలేదని చెప్పారు.
బిల్లు చెల్లింపులు చేయలేదని తెలిపారు. జగన్ కుర్చీ కోసం నాడు పాదయాత్రలో రూ.10 లక్షలు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వైసీపీ పాలనలో తమను తెలంగాణలో కలపమని రోడ్డెక్కిన నిర్వాసితులు నేడు పరిహారం అందడంతో ఊరూరా సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు.
వీళ్లు వ్యవస్థను ధ్వంసం చేయడంలో ఏ అవకాశాన్నీ వదలలేదు: మోదీ