Sharmila On NRT university name change: ‘అవసరం లేదు’.. అంటూ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

‘‘నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాధించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును.. మరో ప్రభుత్వం తొలగిస్తే గొప్ప నాయకులను అవమాన పరిచినట్లే. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లే. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు...రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే?’’ అని షర్మిల ప్రశ్నించారు.

Sharmila On NRT university name change

Sharmila On NRT university name change: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వర్సిటీ వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాధించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును.. మరో ప్రభుత్వం తొలగిస్తే గొప్ప నాయకులను అవమాన పరిచినట్లే. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లే. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు…రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే?’’ అని షర్మిల ప్రశ్నించారు.

అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించి నట్లే కదా? అని షర్మిల నిలదీశారు. ఒకరి ఖ్యాతిని తీసుకుని వైఎస్సార్ కి ఆ ఖ్యాతిని ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. వైఎస్సార్ కి ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదని అన్నారు. వైఎస్సార్ చనిపోతే ఆ బాధ తట్టుకోలేక 700 వందల మంది చనిపోయారని చెప్పారు. అలాంటి ఖ్యాతి ఉన్న వైఎస్సార్ కి ఇంకొకరి ఖ్యాతి అవసరం లేదని స్పష్టం చేశారు.

కాగా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకులే కాకుండా నందమూరి కుటుంబ సభ్యులు కూడా దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం పేరు మార్పును సమర్థించుకుంటోంది.

Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా