రుయాలో కరోనా పేషెంట్ల అటెండర్లకు అనుమతి లేదు..గేటు వరకే : డాక్టర్ భారతి

తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల అటెండర్లను అనుమతించే విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ భారతి స్పష్టం చేశారు. ఇకనుంచి రుయా హాస్పిటల్ కు వచ్చే కరోనా పేషెంట్లకు సహాయకులుగా వచ్చేవారికి ఆసుపత్రిలో అనుమతి లేదని తెలిపారు.

No Permission for Corona Patient Attendants : తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల అటెండర్లను అనుమతించే విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ భారతి స్పష్టం చేశారు. ఇకనుంచి రుయా హాస్పిటల్ కు వచ్చే కరోనా పేషెంట్లకు సహాయకులుగా వచ్చేవారికి ఆసుపత్రిలో అనుమతి లేదని తెలిపారు. అసలే కరోనాతో బాధపడేవారి కూడా వారి బంధువులు వస్తే వారికి కూడా కరోనా వచ్చే అవకాశాలున్నాయనీ కాబట్టి ఇకనుంచి పేషెంట్ల కూడా వచ్చేవారిని అనుమతించేది లేదని తెలిపారు. వార్డులోకి వస్తే..వారికి కూడా మహమ్మారి సోకుతుందని కాబట్టి ఇకనుంచి ఎవ్వరూ రావద్దని తెలిపారు. పేషెంట్లకు సహాయకులుగా వచ్చేవారు గేటు బైట వరకే అనుమతి ఉంటుందని వార్డులోకి రానివ్వమని తెలిపారు.

పేషెంట్లను మేము అప్రమత్తంగా చూసుకుంటాం..మా వైద్యసిబ్బంది అంతా పేషెంట్లను చూసుకోవటానికే ఉన్నామని కాబట్టి దయచేసిన కరోనా నియంత్రణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని పేషెంట్ల బాధ్యత మాది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని వెల్లడించారు. పేషెంట్లకు ఏమన్నా ఇబ్బందులు వస్తే వారి బంధువులకు తాము ముందే ఇన్ఫాం చేస్తామని అన్నారు. ఆస్పత్రి గేట్లు లాక్ చేస్తామని కాబట్టి ఎవ్వరూ పేషెంట్ల కూడా రావద్దని డాక్టర్ భారతి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు