Minister Kiran Rijiju : విశాఖలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన లేదు : కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

హైకోర్టు ఉన్న చోటనే పరిపాలన ట్రైబ్యునల్ శాశ్వత బెంచ్ పెట్టాలని ఓ కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. వీలుకాకపోతే సర్య్యూట్ బెంచ్ ఏర్పాటు చేయవచ్చన్నారు.

Central Administrative Tribunal bench : విశాఖలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. లోక్ సభలో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లోని క్యాట్ పరిధిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విస్తరింపజేశామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

హైకోర్టు ఉన్న చోటనే పరిపాలన ట్రైబ్యునల్ శాశ్వత బెంచ్ పెట్టాలని గతంలో ఓ కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ట్రైబ్యునల్ శాశ్వత బెంచ్ ఏర్పాటు వీలుకాకపోతే కనీసం సర్య్యూట్ బెంచ్ ఏర్పాటు చేయవచ్చని మంత్రి అన్నారు. ట్రైబ్యునల్ చైర్మన్ మాత్రమే సర్క్యూట్ బెంచ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు