Kurnool : కర్నూలు జిల్లా అడవుల్లో క్షుద్రపూజల కలకలం

కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. పత్తికొండ మండలం పందికోన అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలు జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.

Occult Worship

Occult worship in Forests : కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. పత్తికొండ మండలం పందికోన అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలు జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. మట్టి బొమ్మలు, కోడిగుడ్లు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో కొంతమంది క్షుద్రపూజలు నిర్వహించారు.

అమావాస్యకు ముందు అడవిలో ఎందుకు క్షుద్ర పూజలు చేశారన్నది అంతుపట్టడం లేదు. అటవీ ప్రాంతంలో గొర్రెలు కాయడానికి వెళ్లిన కాపరులు క్షుద్ర పూజలు జరిగిన విషయాన్ని గుర్తించారు.

Tragedy : తుంగభద్ర ఎల్ఎల్ సీ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

గుప్త నిధుల కోసమా.. లేక చేతబడి చేశారా అన్నది అంతుపట్టడం లేదు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అటువైపు వెళ్లడానికే సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.