Cyclone Asani : ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం-తానేటి వనిత

అసని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.

Cyclone Asani

Cyclone Asani : అసని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. మానవత్వంతో  సహాయం చేయాలని  సీఎం  జగన్ ఆదేశిచారని.. కోస్తా జిల్లాల్లో తుపాను ప్రభావంపై కలెక్టర్లను, ఎస్పీలను అలర్ట్ చేసినట్లు ఆమె చెప్పారు.

పునరావాస కేంద్రాలలో ఆహారం,మంచినీరు ఏర్పాటు చేస్తున్నామని.. తుపాను వల్ల కురిసే భారీ వర్షాలకు ప్రాణ నష్టం జరగకుండా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆమె అన్నారు. విద్యుత్ సరఫరా పునరుధ్ధరణ కోసం విద్యుత్ శాఖను అప్రమత్తంచేశామని..పునరావాస కేంద్రాలలోని కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందిస్తామని మంత్రి తానేటి వనిత చెప్పారు.
Also Read : Phone Tapping Row : ఫోన్ ట్యాపింగ్ వివాదం.. సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్