శ్రీశైలం గేట్లు ఎత్తివేత…లక్షా 1,642 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

  • Publish Date - August 19, 2020 / 09:28 PM IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలానికి వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకున్నాయి.



గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అలాగే ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం నీటి మట్టం 881 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం డ్యాం మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలశయానికి వరద పోటెత్తడంతో ఇన్ ఫ్లో 3 లక్షల 48, వేల 150 క్యూసెక్కులుగా, ఔట్ ఫ్లో లక్షా 1,642 క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.



ప్రధానంగా కర్నూలు జిల్లాలో కల్ప వృక్షమైనటువంటి శ్రీశైలం డ్యాంకు భారీ ఎత్తున వరద నీరు చేరుకుంది. ఇప్పటికే నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మనంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే క్లస్టర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

మూడు క్లస్టర్ గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి ఒక్కొక్క క్లస్టర్ గేటు నుంచి 22 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 66 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పండగ వాతావరణం నెలకొంది.