Chandrababu Naidu New Convoy
Chandrababu Convoy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభా ప్రాంగణంను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన కాన్వాయ్ లో అధికారులు మార్పులు చేశారు. ప్రస్తుతం వాడుతున్న సఫారీ వాహనాలు కండీషన్ లో లేకపోవడంతో కాన్వాయ్ లో వాహనాలు మార్పు చేశారు.
Also Read : చంద్రబాబు క్యాబినెట్‌లో ఏఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయో తెలుసా?
సెక్యూరిటీ వింగ్ లో అధికారులు, ఇతర వీఐపీలకోసం వినియోగించే పాత వాహనాలను చంద్రబాబు కాన్వాయ్ లో అధికారులు చేర్చారు. ఇకపై చంద్రబాబు కాన్వాయ్ లో పాత సఫారీల స్థానంలో పాత ఫార్చునర్లు ఉండనున్నాయి. పాత కాన్వాయ్ వాహనాల కండిషన్ చూసి ముఖ్యమంత్రి భద్రతకు వాటిని కొనసాగించలేమని భావించిన అధికారులు, వాటి స్థానంలో డిపార్ట్ మెంట్ లో ఉన్న వేరే కార్లను ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే.. చంద్రబాబు ఇప్పటికే పోలీసులకు కీలక సూచనలు చేశారు. తన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ను నిలిపివేయొద్దని, తద్వారా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.