Durgamma Temple Dussehra celebrations
Durgamma Temple Dussehra celebrations : దసరా పండుగ రాబోతోంది. దసరా నవరాత్రులు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్మమ్మ వివిధ రకాల అవతారాలతో భక్తులకు దర్శమివ్వనుంది. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు నిర్వహించారు. సమీక్షలో ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, వీఎంసీ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్, ఈఓ భ్రమరాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సమీక్షపై స్పెషల్ ఎండోమెంట్ సీఎస్ కరికల్ వలవెన్ మాట్లాడుతు..దసరాకి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిగా పరిశీలించామని తెలిపారు.క్యూలైన్లు ,కేశఖండనశాల, కాయలు కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలు, లడ్డు ప్రసాదాల కౌంటర్లు పరిశీలించామన్నారు.క్యూలైన్లో ప్రతి 50 అడుగుల దూరానికి ఒక ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేశామని..చంటి పిల్లలకి పాలు, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్, ఏర్పాటు చేసామని వెల్లడించారు. భక్తులు అంచనాలకు మించి వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా పక్కా ప్రణాళిక రూపకల్పన చేశామని తెలిపారు.దసరా నవరాత్రి ఉత్సవాలకు బడ్జెట్ గురించి ఆలోచించం, ఎంత ఖర్చైనా భక్తుల సౌకర్యం మాకు ముఖ్యమని స్పష్టంచేశారు.
అలాగే ఈ ఏర్పాట్ల గురించి కలెక్టర్ ఢిల్లీ రావ్ మాట్లాడుతు..రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటటువంటి భక్తులకు కావలసిన సౌకర్యాల్ని ఏర్పాటు చేసామని..విఐపి లకు టైం స్లాట్ లేదని స్పష్టం చేశారు.అంతరాలయ దర్శనం కేవలం వీఐపీలకు మాత్రమేనని తెలిపారు. పార్కింగ్ కి సంబంధించి కూడా పుర్తిస్తాయిలో ఏర్పాటులు చేశామని వెల్లడించారు.