Road accident: ఒకదానివెనుక ఒకటి ఢీకొన్న ఐదు వాహనాలు.. నిట్టనిలువునా ఆయిల్ ట్యాంకర్‌కు చీలికలు

ఒంగోలు మండలం వల్లూరు గ్రామ సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలెజ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

Road accident – Prakasam District: ఒంగోలులో ఐదు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్‌ (Oil Tanker)కు నిట్టనిలువునా చీలికలు వచ్చాయి. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు (Eluru) నుండి బెంగళూరు (Bengaluru)కు ఎడిబుల్ ఇంధనంతో ట్యాంకర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

UK PM Rishi Sunak: బ్రిటన్ ప్రధాని నివాసం గేటును ఢీకొట్టిన కారు.. భద్రతా సిబ్బంది ఏం చేశారంటే..

ఒంగోలు (Ongole) మండలం వల్లూరు గ్రామ సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలెజ్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తొలుత టిప్పర్‌ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో నిట్టనిలువునా ఆయిల్ ట్యాంకర్‌కు చీలికలు వచ్చాయి. హైవేపై భారీగా ఎడిబుల్ ఇంధనం కారిపోయింది. ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్ కంట్రోల్ తప్పి ఆయిల్ ట్యాకర్ ను ఢీకొట్టాడు. దీనిని తప్పించబోయి వెనుకాలే వస్తున్న మరో రెండు లారీలు ఢీకొన్నాయి.

100 crore credited: ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడైన దినసరి కూలీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఏలూరు నుండి బెంగళూరుకు ఎడిబుల్ ఇందనంతో ట్యాంకర్ వెళ్తుండగా అర్దరాత్రి 1:30గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రైవేటు ట్రావెల్ బస్సు దెబ్బతినడంతో ట్రావెల్స్ నిర్వాహకులు నెల్లూరు ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించారు. ఒకదాని వెనుక ఒకటి మెత్తం ఐదు వాహనాలు ఢీకొనడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు