100 crore credited: ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడైన దినసరి కూలీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

మహ్మద్ నసీరుల్లా అకౌంట్‌లో 100 కోట్లు జమ కావడంతో బ్యాంకు సిబ్బంది ఆ డబ్బులు ఎలా వచ్చాయనే విషయం ఆరా తీస్తున్నారు.

100 crore credited: ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడైన దినసరి కూలీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

100 crore credited

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఓ దినసరి కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. కోటీశ్వరుడు కావడం అంటే కోటి రెండు కోట్లతో కాదు.. ఏకంగా 100 కోట్లతో. అతని ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో రూ. 100 కోట్లు జమ అయ్యాయి. అతనికి ఆ డబ్బులు జమ అయినట్లు తెలియదు. ఆ కూలీ ఇంటికి సైబర్ క్రైం పోలీసుల నుంచి నోటీసులు రావడంతో అసలు విషయం తెలిసింది. నీ అకౌంట్‌లో రూ. 100 కోట్లు జమ అయ్యాయి.. అందుకు సంబంధించిన పత్రాలను ఈనెల 30వ తేదీలోగా తీసుకురావాలని నోటీసుల్లో సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. దీంతో కంగుతిన్న సదరు కూలీ.. అకౌంట్‌లో నగదును చెక్ చేసుకున్నాడు. నిజంగానే అతని అకౌంట్ లో 100 కోట్లు ఉండటంతో అతనికి దిమ్మతిరిగిపోయింది.

Hyundai Exter Launch : టాటా పంచ్‌కు పోటీగా అద్భుతమైన ఫీచర్లతో హ్యుందాయ్ ఎక్స్‌టర్.. జూలై 10నే భారత్‌లో లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దేగంగాలోని వాసుదేవ్‌పూర్‌లో మహ్మద్ నసీరుల్లా అనే వ్యక్తికి ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంది. అందులో ఈ డబ్బు జమ అయింది. అతడు వ్యవసాయ కూలీ. తల్లిదండ్రులతో పాటు భార్య, పిల్లలు అందరూ అతని సంపాదనపైనే ఆధారపడి ఉన్నారు. రోజూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కసారిగా అతని అకౌంట్‌లో 100 కోట్లు జమ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో మహ్మద్ నసీరుల్లా భయంతో వణికిపోయాడు. ఈ నగదు జమకాక ముందు అతని అకౌంట్ లో కేవలం రూ. 17 మాత్రమే ఉంది. సైబర్ క్రైం పోలీసులు నోటీసులతో పాటు స్థానిక పోలీసుల నుంచి కూడా ఫోన్ కాల్ వచ్చింది. దీంతో నాకు నిద్రపట్టలేదని, నేనేం చేయాలో నాకు తెలియలేదని నసీరుల్లా తెలిపాడు.

MG ZS EV Car Volumes : 2020 నుంచి 10వేల యూనిట్లకుపైగా వాల్యూమ్‌లను నమోదు చేసిన ఎంజీ ZS ఎలక్ట్రిక్ కారు..

తన అకౌంట్ లో జమైన నగదు గురించి ఆరా తీసేందుకు బ్యాంకు వద్దకు వెళ్లినట్లు తెలిపాడు. నేను నా పాస్ బుక్ తో బ్యాంకుకు వెళ్లాను. అసలు విషయం తెలుసుకొనే ప్రయత్నం చేశాను. బ్యాంకు లావాదేవీల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రమాదవశాత్తూ నీ అకౌంట్‌లో వందకోట్లు జమ అయ్యి ఉంటాయని వారు చెప్పారు. అయితే, మహ్మద్ నసీరుల్లా అకౌంట్‌‌లో 100 కోట్లు జమ కావడంతో బ్యాంకు సిబ్బంది ఆ డబ్బులు ఎలా వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై స్థానిక మీడియా బ్యాంకు అధికారులను సంప్రదించగా.. ఈ ఘటనపై సైబర్ క్రైం పోలీసుల విచారణ జరుగుతుందని, మేం వివరాలేమీ చెప్పలేమని చెప్పారు.

Tech Tips in Telugu : మీ ఏసీ ఫాస్ట్‌గా కూల్ కావాలన్నా.. కరెంట్ బిల్లు తగ్గాలన్నా.. ఈ 10 సింపుల్ టిప్స్ తప్పక పాటించండి!

ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని బ్యాంకు సిబ్బంది వెల్లడించారు. గతేడాది తమిళనాడులోని చెన్నై టీ నగర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారుల ఖాతాల్లో 13 కోట్లు జమ కాగా, వారంతా ఒక్కసారిగా కోటీశ్వరులు అయ్యారు.