MG ZS EV Car Volumes : 2020 నుంచి 10వేల యూనిట్లకుపైగా వాల్యూమ్‌లను నమోదు చేసిన ఎంజీ ZS ఎలక్ట్రిక్ కారు..

MG ZS EV Car Volumes : 2020లో లాంచ్ అయినప్పటి నుంచి MG ZS EV వాల్యూమ్‌లు 10వేల యూనిట్లకు పైగా నమోదు చేసినట్టు ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ ప్రకటించింది. ఈ కారు మోడల్ ధర రూ. 23.38 లక్షల నుంచి రూ. 27.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది.

MG ZS EV Car Volumes : 2020 నుంచి 10వేల యూనిట్లకుపైగా వాల్యూమ్‌లను నమోదు చేసిన ఎంజీ ZS ఎలక్ట్రిక్ కారు..

MG ZS EV volumes at over 10,000 units since launch in 2020

MG ZS EV Car volumes over 10,000 units : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) తన ప్రీమియం ఎలక్ట్రిక్ మోడల్, MG ZS EV, జనవరి 2020లో దేశంలో లాంచ్ అయినప్పటి నుంచి 10వేల యూనిట్ల కన్నా ఎక్కువ వాల్యూమ్‌లను సంపాదించిందని ప్రకటించింది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లలో ఈ వెహికల్ అందుబాటులో ఉంది.

ఈ మోడల్ ధర రూ. 23.38 లక్షల నుంచి రూ. 27.30 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. MG ZS EV ఆరు ఛార్జింగ్ ఆప్షన్లతో వస్తుంది. DC సూపర్‌ఫాస్ట్, AC ఫాస్ట్, MG డీలర్‌షిప్‌లలో AC ఫాస్ట్, మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఇందులో పోర్టబుల్, 24X7 RSA, MG ఛార్జ్ ఇనిషియేటివ్ కలిగి ఉంది. MG ఛార్జ్ కార్‌మేకర్ వెయ్యి రోజుల్లో భారత్‌లో కమ్యూనిటీ ప్రాంతాల్లో 1,000 AC ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : Tech Tips in Telugu : మీ ఏసీ ఫాస్ట్‌గా కూల్ కావాలన్నా.. కరెంట్ బిల్లు తగ్గాలన్నా.. ఈ 10 సింపుల్ టిప్స్ తప్పక పాటించండి!

పూర్తి ఛార్జ్‌పై 461కి.మీ దూసుకెళ్లగలదు.. :
ఈ ఎలక్ట్రిక్ వాహనం 50.3kWH ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీతో వచ్చింది. 176PS మోటార్‌ అమర్చారు. ఈ కారు 8.5 సెకన్లలో 0 నుంచి 100కిమీ వేగాన్ని అందుకోగలదు. MG ZS EV వేగం పరిధి ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 461కిమీ దూసుకెళ్లగలదు.. MG ZS EVలో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, PM 2.5 ఫిల్టర్, బ్లూటూత్ టెక్నాలజీతో డిజిటల్ కీ, రియర్-డ్రైవ్ అసిస్ట్, వెనుక పార్కింగ్ సెన్సార్‌తో 360-డిగ్రీ చుట్టూ వ్యూ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ ఫ్రంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MG ZS EV volumes at over 10,000 units since launch in 2020

MG ZS EV Car Volumes at over 10,000 units since launch in 2020

వైపర్, 10-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల ఎంబెడెడ్ LCD స్క్రీన్‌తో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. ఈ కారు ZS మోడల్ i-Smart కనెక్టివిటీ టెక్నాలజీతో వస్తుంది. 75కి పైగా ఫీచర్లను అందిస్తుంది. ఎంజీ మోటార్ ఇటీవల రెండవ ఎలక్ట్రిక్ మోడల్, MG కామెట్ EVని లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 7.98 లక్షల నుంచి రూ. 9.98 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇప్పుడు ఈ కంపెనీ ప్రొడక్టు పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. అందులో MG 2023లో కొత్త మోడల్‌ల కోసం దాదాపు 24వేల యూనిట్ల కంబైన్డ్ వాల్యూమ్‌లను క్లాక్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : BMW Z4 Roadster : కారు భలే ఉంది భయ్యా.. BMW Z4 రోడ్‌స్టర్ వచ్చేసిందోచ్.. కేవలం 4.5 సెకన్లలో 100కి.మీ దూసుకెళ్తుంది..!