BMW Z4 Roadster : కారు భలే ఉంది భయ్యా.. BMW Z4 రోడ్‌స్టర్ వచ్చేసిందోచ్.. కేవలం 4.5 సెకన్లలో 100కి.మీ దూసుకెళ్తుంది..!

BMW Z4 Roadster : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? కొత్త BMW Z4 రోడ్‌స్టర్ కారు భారత మార్కెట్లోకి వచ్చేసింది.. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

BMW Z4 Roadster : కారు భలే ఉంది భయ్యా.. BMW Z4 రోడ్‌స్టర్ వచ్చేసిందోచ్.. కేవలం 4.5 సెకన్లలో 100కి.మీ దూసుకెళ్తుంది..!

BMW Z4 Roadster launched in India, priced at Rs 89.30 lakh

BMW Z4 Roadster : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ (BMW) భారత మార్కెట్లో కొత్త BMW Z4 రోడ్‌స్టర్‌ను లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 89.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. వచ్చే జూన్ నుంచి ఫుల్ బిల్ట్-అప్ యూనిట్ (CBU) మోడల్‌గా రానుంది. దేశవ్యాప్తంగా అన్ని BMW డీలర్‌షిప్‌లలో ఈ కొత్త Z4 మోడల్ కారు అందుబాటులో ఉంటుంది. BMW Z4 రోడ్‌స్టర్ BMW (M) పెర్ఫార్మెన్స్ మోడల్‌ (BMW Z4 M40i)గా అందుబాటులో ఉంది.

ఒకే నాన్-మెటాలిక్ పెయింట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఆల్పైన్ వైట్, మల్టీ మెటాలిక్ పెయింట్‌వర్క్‌లు థండర్‌నైట్ (కొత్తది), స్కైస్క్రాపర్ గ్రే (కొత్తది), పోర్టిమావో బ్లూ (కొత్తది), బ్లాక్ సఫైర్, శాన్ ఫ్రాన్సిస్కో రెడ్, ఫ్రోజెన్ గ్రే II కలర్ ఆప్షన్లలో వస్తుంది. స్టాండర్డ్ ఇంటీరియర్ ట్రిమ్ అల్యూమినియం మెష్ ఎఫెక్ట్‌లో ఉంది. లెదర్ వెర్నాస్కా బ్లాక్, లెదర్ వెర్నాస్కా కాగ్నాక్, లెదర్ వెర్నాస్కా మాగ్మా రెడ్‌లలో అప్హోల్స్టరీ ఆప్షన్లలో ఉన్నాయి.

Read Also : Maruti Suzuki Jimny Price : ఐదు డోర్లతో జిమ్నీ SUV వచ్చేస్తోంది.. 30వేల బుకింగ్స్.. ధర తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే..!

BMW Z4 కారు LED హెడ్‌లైట్‌లతో కొత్తగా రూపొందించిన BMW కిడ్నీ గ్రిల్‌ను కలిగి ఉంది. సాఫ్ట్ టాప్ పది సెకన్లలో పవర్‌తో ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే క్లోజ్ అవుతుంది. ఫ్రంట్ వీల్ ఆర్చ్‌లు, ఏరోడైనమిక్ ఎయిర్ వెంట్‌లపై పెద్ద ఎయిర్ బ్రీటర్‌లు ఉన్నాయి. కారు వెనుక స్పాయిలర్ సర్‌ఫేస్ నుంచి ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, పార్శ్వ డిజైన్ లైన్లు సన్నని L-ఆకారపు LED వెనుక లైట్లు ఉన్నాయి.

BMW Z4 Roadster launched in India, priced at Rs 89.30 lakh

BMW Z4 Roadster launched in India, priced at Rs 89.30 lakh

లోపలి భాగంలో, BMW Z4 రోడ్‌స్టర్‌లో మెమరీ ఫంక్షన్, టూ-జోన్ ఎయిర్ కండిషనింగ్, BMW లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్‌తో కూడిన BMW ఆపరేటింగ్ సిస్టమ్ 7.0 ఉంది. 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాక్టివ్ పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ (PDC), హర్మాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో సీట్లు ఉన్నాయి. 12 లౌడ్ స్పీకర్‌లు, BMW హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫంక్షన్, డ్రైవర్, ప్యాసింజర్ ఫ్రంట్, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

ఈ కారులో బ్లాక్ కలర్‌లో ఉండే మిర్రర్ క్యాప్స్, సాఫ్ట్ టాప్ ఆంత్రాసైట్, అడాప్టివ్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మిర్రర్ ప్యాకేజీ, M సీట్ బెల్ట్‌లు, డ్రైవింగ్ అసిస్టెంట్, యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్టెంట్ వంటి అనేక రకాల ఆప్షనల్ డివైజ్‌లు ఉన్నాయి. BMW Z4 రోడ్‌స్టర్‌లో థర్డ్ జనరేషన్, 3-లీటర్ 6-సిలిండర్ ఇన్-లైన్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. 340hp గరిష్ట శక్తిని 500Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది.

Read Also : Tech Tips in Telugu : మీ ఏసీ ఫాస్ట్‌గా కూల్ కావాలన్నా.. కరెంట్ బిల్లు తగ్గాలన్నా.. ఈ 10 సింపుల్ టిప్స్ తప్పక పాటించండి!