Maruti Suzuki Jimny Price : ఐదు డోర్లతో జిమ్నీ SUV వచ్చేస్తోంది.. 30వేల బుకింగ్స్.. ధర తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే..!

Maruti Suzuki Jimny Price : మారుతి సుజుకి జిమ్నీ ఇప్పటివరకు 30వేల బుకింగ్‌లను సాధించింది. వచ్చే జూన్ మొదటివారంలో జిమ్నీ ధరలను అధికారికంగా మారుతి సుజుకి ఇండియా ప్రకటించనుంది.

Maruti Suzuki Jimny Price : ఐదు డోర్లతో జిమ్నీ SUV వచ్చేస్తోంది.. 30వేల బుకింగ్స్.. ధర తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే..!

Maruti Suzuki Jimny price announcement in first week of June

Maruti Suzuki Jimny price announcement : ప్రముఖ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) వచ్చే జూన్ మొదటి వారంలో ఐదు డోర్ల జిమ్నీ SUV ధరలను ప్రకటించనుంది. జిమ్నీ ధర ప్రకటించిన తర్వాత వెంటనే ఆఫ్-రోడర్ కస్టమర్ డెలివరీలను ప్రారంభించనుంది. గత జనవరి 12న SUV కార్లపై ఆర్డర్లను తీసుకున్న మారుతి జిమ్నీ 30వేల కన్నా ఎక్కువ బుకింగ్‌లను సాధించింది.

మారుతి FY24 ఆర్థిక సంవత్సరంలో 475,000 యూనిట్ల వాల్యూమ్‌లతో SUV మార్కెట్‌లో 25శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. SUV పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు ఫ్రాంక్స్, జిమ్నీ, బ్రెజ్జా, గ్రాండ్ విటారా ఉన్నాయి. జిమ్నీ మొదటి రెండు ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also : Reliance JioMart Layoffs : కోత మొదలైంది.. జియోమార్ట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు.. మరో 9వేల జాబ్స్ తగ్గించే అవకాశం..!

జీటా, ఆల్ఫా 4WD టెక్నాలజీ ప్రామాణికమైనదిగా చెప్పవచ్చు. అందుకే జిమ్నీ ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ జిమ్నీ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. జిమ్నీలో పాత K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండనుంది. 105PS గరిష్ట శక్తి, 134Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ MT 4-స్పీడ్ AT ఉన్నాయి. లాడర్ ఫ్రేమ్ చాసిస్ ఆధారంగా, SUV లో రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్ (4L మోడ్) ప్రమాణంగా ALLGRIP PRO 4WD టెక్నాలజీతో రానుంది.

Maruti Suzuki Jimny price announcement in first week of June

Maruti Suzuki Jimny price announcement in first week of June

మారుతి సుజుకి జిమ్నీ ప్రధాన పోటీదారుగా మహీంద్రా థార్ (Mahindra Thar) లేదా మరో ప్రత్యర్థి ఫోర్స్ గూర్ఖా (Force Gurkha) నిలువనున్నాయి. జిమ్నీకి వాషర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్‌గా ఎడ్జెస్ట్ చేయగల ఫోల్డబుల్ ORVMలు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

హార్డ్ టాప్, డ్రిప్ రైల్స్, క్లామ్‌షెల్ బానెట్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ వంటి కొన్ని ఫీచర్లు ప్రామాణికమైనవిగా చెప్పవచ్చు. క్యాబిన్ లోపల ఫీచర్లలో HD డిస్‌ప్లేతో కూడిన 9-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto కనెక్టివిటీ, Arkamys సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. జిమ్నీ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్‌వ్యూ కెమెరా, ISOFIX, EBDతో కూడిన ABSలను అందిస్తుంది.

Read Also : ChatGPT App for iPhones : ఈ 12 దేశాల్లోని ఐఫోన్లలో చాట్‌జీపీటీ యాప్.. ఇందులో భారత్ ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..!