Madhavi Latha Vs JC Prabhakar Reddy : తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఓన్లీ లేడీస్ పార్టీపై రచ్చ రేగింది. డిసెంబర్ 31న పార్టీ ఏర్పాటు చేసిన జేసీ.. కేవలం మహిళలను మాత్రమే ఆహ్వానించారు. ఈ పార్టీపై నటి, బీజేపీ నేత మాధవీలత స్పందించారు. ఓన్లీ లేడీస్ పార్టీకి వెళ్లొద్దని ఆమె మహిళలకు అప్పీల్ చేశారు. వేడుక నిర్వహించే ఆ ప్రాంతంలో గంజాయి సేవించే వాళ్లు ఎక్కువగా ఉంటారని, మహిళకు ఆ ప్లేస్ సేఫ్ కాదని మాధవీలత ఓ వీడియోలో చెప్పారు.
అటు.. జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను మంటగలుపుతున్నారని బీజేపీ, వీహెచ్ పీ విమర్శలు చేశాయి. ఈ వ్యవహారంపై జేసీ కౌంటర్ అటాక్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. మాధవీ లతను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుని కాక రేపుతోంది.
Also Read : నాడు ఓ వెలుగు వెలిగారు, నేడు పుట్టెడు కష్టాలు..! ఆ ముగ్గురు నానీల పరిస్థితి ఇలా ఎందుకైంది?
మాధవీ లత లాంటి వ్యక్తితో మా ఊరి మహిళలకు నీతులు చెప్పిస్తారా? బీజేపీ వాళ్లకు నీతి, నియమం లేదా? అంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాధవీ లతను ఉద్దేశించి ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దాంతో వివాదం ముదిరింది. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై మాధవీ లత తీవ్రంగా స్పందించారు. వయసులో పెద్ద వారు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. మహిళలు సురక్షితంగా ఉండాలని చెప్పడమే నేను చేసిన తప్పా? అని ఆమె ప్రశ్నించారు. తాడిపత్రిలో ఉండే వాళ్లు మాత్రమే మహిళలా? మిగిలిన వారంతా బజారు వాళ్లా? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు మాధవీ లత.
JC Prabhakar Reddy
”వయసులో పెద్ద వారు. ఆ వయసు వ్యక్తి మంచి మాటలు మాట్లాడాలి. గౌరవపరమైన మాటలు మాట్లాడాలి. కానీ, అసభ్యకరమైన పదాలు వాడటం దారుణం. ఆయన భాషా విధానం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఏంటన్నది ప్రజలు వినగలుగుతున్నారు. మహిళలు సురక్షితంగా ఉండాలని చెప్పినందుకు ఆయన నన్ను అంత మాట అనేశారు. ఇదేనా ఆయన మహిళా అభ్యున్నతి.
”మా తాడిపత్రి మహిళలు అంటే తాడిపత్రిలో ఉండే వాళ్లు మాత్రమే మహిళలా? మిగిలిన వారంతా బజారు వాళ్లా? జేసీ ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం ఏంటన్నది నాకు అర్థం కావడం లేదు. అది ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. జేసీ ఫ్యామిలీ నిర్వహించిన వేడుక ప్రాంతాన్ని గంజాయి ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. చాలా మంది గాంజా తీసుకోవడమే కాదు అక్కడ అమ్ముతారని కూడా చెప్పారు. ఈ క్రమంలో మహిళల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని నేను జాగ్రత్తలు చెప్పాను. ఓన్లీ లేడీస్ పార్టీకి వెళ్లకపోవడమే మంచిదని సూచించాను. దాన్ని రాజకీయం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. అవేర్ నెస్ క్రియేట్ చేయడం కోసం నేను అలా చెప్పాను” అని మాధవీ లత అన్నారు.
”తాడిపత్రి చరిత్రకు, నేర చరిత్రకు సంబంధం లేదు. ఊరి చరిత్రలు వేరు, ఊరి గొప్పలు వేరు. అక్కడున్న అలవాట్లు వేరు. అర్థరాత్రి పార్టీలకు వెళ్లే కల్చరా తాడిపత్రి ఆడవాళ్ల కల్చరా? అర్థరాత్రి డీజేలు పెట్టుకుని ఎగిరే కల్చర్ తాడిపత్రి కల్చరా? దీనికి సమాధానం చెప్పండి. అవును అదే మా కల్చర్. అర్థరాత్రి వెళ్లి మేమంతా ఎగురుతాము అంటే ఓకే. నేను ఏమీ అనను. నాకు తాడిపత్రి మహిళ, మరో మహిళ అని లేదు. నేను కూడా మహిళనే. ఏ ఊరి మహిళ అయినా మహిళే నాకు” అని మాధవీ లత అన్నారు.
Also Read : మహిళా లోకానికి జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : బీజేపీ నేత శ్రీనివాసులు