Satya Kumar Yadav : అంత ప్రేమ ఉంటే జగన్ పంచన చేరండి.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం

వయసుకు తగిన విధంగా జేసీ ఉంటే మంచిదని హితవు పలికారు.

Satya Kumar Yadav : న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఓన్లీ లేడీస్ పార్టీ రచ్చ రచ్చగా మారింది. ఈ పార్టీపై సినీ నటి, బీజేపీ నేత మాధవీ లత చేసిన వ్యాఖ్యలు, దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన కౌంటర్.. వివాదాన్ని రాజేసింది. మాధవీ లత, బీజేపీని ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ టార్గెట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలోకి మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. వయసుకు తగ్గట్లు మాట్లాడండి అంటూ జేసీకి హితవు పలికారు.

మాట్లాడేటప్పుడు కంట్రోల్ ఉండాలి…
”జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేటప్పుడు కంట్రోల్ ఉండాలి. మీడియా అటెన్షన్ కోసం ఏదేదో మాట్లాడుతుంటారు. బీజేపీ ప్రభుత్వం తమ బస్సులు కాల్చిందని చెబుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి స్పోక్స్ పర్సనా? జేసీ ప్రభాకర్ రెడ్డికి జగన్ పై అంత ప్రేమ ఉంటే వెళ్లి జగన్ పంచన చేరమనండి? ఎప్పుడూ కాంట్రవర్సీ.. జేసీ ప్రభాకర్ రెడ్డికి అలవాటైంది. జగన్ ప్రభుత్వం ఆయన వాహనాలు దొంగవని కేసు పెట్టింది. దానికి, బీజేపీకి ఏం సంబంధం?

మాధవీ లత 31వ తేదీ రాత్రి ఫంక్షన్ చేసుకునేటప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పారు. ఎవరు ఏ బట్టలు వేసుకోవాలో, ఎవరు ఏం మాట్లాడాలో జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాలా? అలా మాట్లాడటాన్ని కుసంస్కారం అంటారు. నరేంద్ర మోదీ సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో ఉంది. అభివృద్ది సాధిస్తోంది. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదు” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

Also Read : మహిళా లోకానికి జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : బీజేపీ నేత శ్రీనివాసులు

బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులపై జేసీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. జేసీ వ్యాఖ్యలు సరికాదన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వయసుకు తగిన విధంగా జేసీ ఉంటే మంచిదని హితవు పలికారు. జేసీ వ్యాపారాలపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.

జగన్ మీద అంత ప్రేమ ఉంటే.. జగన్ పంచన చేరండి..
”అధికారికంగా ఆయన ఏమైనా టీడీపీ స్పోక్స్ పర్సనో ఏమో నాకు తెలీదు. ఎందుకిలా మాట్లాడతారో తెలీదు. ఎవరికైనా సరే మాటల మీద కంట్రోల్ ఉండాలి. అటువంటి భాషా ప్రయోగం కరెక్ట్ కాదు. ఆయన వయసుకు అసలు మంచిది కాదు. అదే విషయాన్ని నేను చెప్పాను. జగన్ మీద ఆయనకు అంత ప్రేమ ఉంటే.. వెళ్లి జగన్ పంచన చేరమనండి. ఎవరు వద్దన్నారు? ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఉండి.. జగనే మంచోడు అంటున్నారంటే.. కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారా? ఎప్పుడూ కాంట్రవర్సీస్ లో ఉండటం అనేది ఆయనకు అలవాటైంది.

వివాదాల్లో ఉండటం తద్వారా మీడియా అటెన్షన్ పొందటం ఆయనకు అలవాటు. అందులో భాగంగానే ఆయన ఏదో ఒకటి మాట్లాడి ఉంటారు. అంతకు మించి ఏమీ లేదు. అందులో ఎవరికి ఏం సంబంధం ఉంది? జగన్ ప్రభుత్వం ఆయన వాహనాలపై కేసులు పెట్టింది. దానికి బీజేపీ ఎలా బాధ్యత వహించాలి? నైట్ పార్టీకి వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండాలని మాధవీ లత చెప్పారు.

మహిళలు జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, రాత్రి సమయంలో బయటకు వెళ్లొదని చెప్పారు. సాటి మహిళగా జాగ్రత్తలు చెప్పారు. అందులో ఏ రకంగా తప్పు ఉందో నాకు అర్థం కాలేదు. మహిళల గురించి అలా మాట్లాడటం సంస్కారం కాదు. అవనసరమైన వివాదాల్లోకి వెళ్లడం ఆయనకు అలవాటు, మాకు ఆ అలవాటు లేదు” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

 

Also Read : తాడిపత్రి మహిళలే.. మహిళలా? మరి మిగిలిన వాళ్లు ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాధవీలత ఫైర్