మహిళల భద్రతపై ఒక చట్టాన్ని తీసుకరావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు ప్రతిపక్ష నేతలు సలహాలు ఇవ్వాలని చేతకాకపోతే కూర్చొవాలని అన్నారు వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం సభలో మహిళల భద్రత బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బాబు…పలు అత్యాచార ఘటనలను ప్రస్తావించారు. వైసీపీ నేతలు కూడా ఇందులో ఉన్నారన్న వ్యాఖ్యలు చేశారు. అనంతరం అంబటి ఇందులో జోక్యం చేసుకున్నారు.
మహిళా భద్రతపై ఒక చట్టాన్ని తీసుకరావాలని ప్రభుత్వం యోచిస్తోందని, ప్రధాన ప్రతిపక్ష నాయకులు సలహాలు ఇవ్వాలన్నారు. మొత్తం క్రైం లిస్టు చదవడం, వైసీపీ నేతలు అలా..ఇలా చేయడం ఒక సంప్రదాయమేనా అని నిలదీశారు. సలహాలు ఇవ్వకపోతే..కూర్చొవాలని సూచించారు. సందర్భం వచ్చినప్పుడు ఇతర విషయాలు చెప్పాలన్నారు. తమపై విమర్శలు చేస్తే..ప్రతి విమర్శలు చేసే అవకాశం ఇవ్వొద్దన్నారు. దీనికి బాబు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో ఆడపిల్లలపై అత్యాచారాలు, అఘాయిత్యాల విషయాలపై మాట్లాడినప్పుడు..అందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని, ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో తాను ఈ విషయాలను వెల్లడించడం జరిగిందన్నారు బాబు.
Read More : మహిళల భద్రత చట్టానికి టీడీపీ సపోర్టు..బాబు సూచనలు