Oxygen Shortage : రుయా ఆసుపత్రి వద్ద ఆర్తనాదాలు, ఆక్సిజన్ అందక పలువురి మృతి?

రాయలసీమకు తలమానికం అయిన రుయా ఆసుపత్రి వద్ద ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.

 Tirupati : రాయలసీమకు తలమానికం అయిన రుయా ఆసుపత్రి వద్ద ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఆక్సిజన్ అందక పలువురు చనిపోయారనే వార్త దావానంలా వ్యాపించింది. తమ బంధువులు చనిపోయారని, దాదాపు గంటల పాటు ఆక్సిజన్ నిలిచిపోయిందని ఆరోపిస్తూ..వైద్యాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే..మరణాలను మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు. తమ వాళ్లు క్షేమంగా ఉన్నారా ? మరణించారా ? అనే విషయం తెలియడం లేదు.

రుయా ఆసుపత్రిలో పలువురు కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. పలువురు ఐసీయూ వార్డులో ఆక్సిజన్ బెడ్స్ పై చికిత్స పొందుతున్నారు. అయితే..2021, మే 10వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు ఆక్సిజన్ అందక తీవ్ర అష్టకష్టాలు పడ్డారు. సీపీఆర్ విధానంలో 11 మంది రోగులకు కృత్రిమంగా శ్వాస అందించినట్లు తెలుస్తోంది. తమ కుటుంబసభ్యులు చనిపోయారని, వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు వెల్లడిస్తున్నారు. మరి ఆక్సిజన్ అందక ఎంత మంది చనిపోయారనేది కొద్దిసేపట్లో తెలియనుంది.

Read More : Rua Hospital : రుయా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, నిలిచిన ఆక్సిజన్

ట్రెండింగ్ వార్తలు