Rua Hospital : రుయా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, నిలిచిన ఆక్సిజన్

చిత్తూరు జిల్లాలో ప్రధాన ఆసుపత్రి అయిన..రుయా వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనే వార్త తీవ్ర కలకలం రేపింది.

Rua Hospital : రుయా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, నిలిచిన ఆక్సిజన్

Ruya

Oxygen : ఏపీ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ప్రధాన ఆసుపత్రి అయిన..రుయా వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందనే వార్త తీవ్ర కలకలం రేపింది. కోవిడ్ వార్డులోని ఐసీయూలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. పలువురు మృతి చెందారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

చికిత్స పొందుతున్న రోగులు ఆక్సిజన్ అందక అష్టకష్టాలు పడుతున్నారనే వార్త హల్ చల్ చేసింది. దీంతో రోగుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సీపీఆర్ విధానంలో 11 మంది రోగులకు కృత్రిమంగా శ్వాస అందిస్తున్నారని తెలుస్తోంది. రోగుల ప్రాణాలను నిలబెట్టేందుకు డాక్టర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

అయితే..ఆక్సిజన్ ను పునరుద్ధరించామంటున్నారు అధికారులు. అధికారుల తీరుపై రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ కొరత రాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. ఆసుపత్రిపై దాడి చేస్తారని భావించిన పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు.

Read More : Refrigerated Trucks: సంవత్సరం గడిచినా రిఫ్రిజరేషన్ ట్రక్కుల్లో వందల శవాలు