Refrigerated Trucks: సంవత్సరం గడిచినా రిఫ్రిజరేషన్ ట్రక్కుల్లో వందల శవాలు

కొవిడ్ మహమ్మారి ఏడాదిన్నరకు పైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికాలోనే కరోనా మృతులు ఎక్కువగా కనిపించాయి.

Refrigerated Trucks: సంవత్సరం గడిచినా రిఫ్రిజరేషన్ ట్రక్కుల్లో వందల శవాలు

Refrizaration Trucks

Refrigerated Trucks: కొవిడ్ మహమ్మారి ఏడాదిన్నరకు పైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో అమెరికాలోనే కరోనా మృతులు ఎక్కువగా కనిపించాయి. దురదృష్టవశాత్తు అప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తి కాకుండా వందల కొద్దీ శవాలు రిఫ్రిజరేటెడ్ ట్రక్కుల్లోనే ఉండిపోయాయట.

అక్కడి లోకల్ మీడియా రిపోర్టు ప్రకారం.. సిటీ కౌన్సిల్ హెల్త్ కమిటీ గత వారం 750కొవిడ్ బాధితుల మృతదేహాలు ఇంకా ట్రక్కుల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఒకొక్కటిగా వాటిని తగ్గించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

హార్ట్ ఐలాండ్ అనే ప్రాంతం యునైటెడ్ స్టేట్స్ లో ఉంది. దానిని పేదవారు, గుర్తు తెలియని శవాలను పూడ్చడానికి దశాబ్ద కాలంగా వినియోగిస్తున్నారు. ఈ డెడ్ బాడీలను కూడా అక్కడే ఖననం చేసే ఆలోచనలో ఉన్నారు.

గతేడాది మార్చి.. ఏప్రిల్ నుంచి వాటిని అలాగే ఉంచడం వల్ల వారి కుటుంబీకులు ఇంకొంత కాలం వారిని చూసి పోవడానికి వీలుంటుంది. అయితే వాటిని తగ్గించే క్రమంలో వంతుల వారీగా అంత్యక్రియలు పూర్తి చేస్తున్నాం. చాలా శవాలు ఇంకా ట్రక్కుల్లోనే ఉన్నాయి. హార్ట్ ఐలాండ్ లోనే ఖననం చేయాలని అనుకుంటున్నాం అని అధికారులు చెబుతున్నారు.