క్రీడా పురస్కారాలు..అర్జున అవార్డు అందుకున్న సాయి ప్రణీత్

హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

2018 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలకు ఎంపికైన క్రీడాకారులు  కోవింద్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. పారా అథ్లెట్ దీమా మాలిక్.. భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’ అవార్డు అందుకున్నారు. ఏషియన్  గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన స్వప్నా బర్మాన్,మిర్జా,షట్లర్  సాయి ప్రణీత్ ‘అర్జున అవార్డు’ అందుకున్నారు.