Paritala Sreeram: గుడ్ మార్నింగ్ చెబుతున్న కేతిరెడ్డితో ప్రజలు ఇలా అంటున్నారు: పరిటాల శ్రీరామ్

కేతిరెడ్డిని చూసి ధర్మవరం ప్రజలు భయపడుతున్నారని పరిటాల శ్రీరామ్ విమర్శించారు.

Paritala Sreeram, Kethireddy

Kethireddy: వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ… ఏపీ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోందంటూ కేతిరెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేతిరెడ్డి అరాచకానికి మాత్రమే టీడీపీ అడ్డుపడుతుందని చెప్పారు.

కేతిరెడ్డిని చూసి ధర్మవరం ప్రజలు భయపడుతున్నారని పరిటాల శ్రీరామ్ విమర్శించారు. గుడ్ మార్నింగ్ చెబుతున్న కేతిరెడ్డికి ప్రజలు గుడ్ బై చెబుతున్నారని చురకలంటించారు. జిల్లేడుబండ రిజర్వాయర్‌కు 4 గ్రామాల ప్రజలు నష్టపోతే పరిహారం ఇవ్వకుండా పనులు మొదలుపెట్టారని చెప్పారు.

కేతిరెడ్డిని శాశ్వతంగా ప్రతిపక్షంలో కూర్చోబెడతామన్నారు పరిటాల శ్రీరామ్. ప్రజలను భయపెడుతూ కేతిరెడ్డి పాలన సాగించాలనుకుంటున్నారని అన్నారు. కేతిరెడ్డి చేసిన అక్రమాలన్నింటిపై టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయిస్తామని చెప్పారు.

ధర్మవరం పట్టణంలో రోడ్ల విస్తరణ అంటూ ఇళ్లను కూల్చేశారని పరిటాల శ్రీరామ్ అన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి కూడా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. కేతిరెడ్డిని ఇంటికి పంపడానికి నియోజక వర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు పరిటాల శ్రీరామ్.

Amarnath: ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ అంశాలను ప్రజలముందు పెడుతున్నాను: మంత్రి అమర్‌నాథ్