Amarnath: ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ అంశాలను ప్రజలముందు పెడుతున్నాను: మంత్రి అమర్‌నాథ్

దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని అమర్‌నాథ్ తెలిపారు.

Amarnath: ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈ అంశాలను ప్రజలముందు పెడుతున్నాను: మంత్రి అమర్‌నాథ్

Gudivada Amarnath

Updated On : December 16, 2023 / 6:09 PM IST

Bhogapuram Airport: వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలనే ఉద్దేశంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను ప్రజలకు చూపిస్తున్నామని చెప్పారు.

ఏదేమైనప్పటికీ 30 నెలల్లోనే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరుగుందని అమర్‌నాథ్ తెలిపారు. 2025 డిసెంబర్‌లోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే జరుగుతుందని చెప్పారు.

ఎన్నో గొప్ప కార్యక్రమాలను జగన్ అమలు చేస్తున్నారని అమర్‌నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర సంసృతి, సంప్రదాయాలను తలపించేలా ఎయిర్‌పోర్ట్ టర్మినల్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని తెలిపారు.

CM Revanth Reddy Speech: అప్పుడు ప్రగతి భవన్‌ ముందు ఎర్రటి ఎండలో గద్దరన్న నిలబడినప్పటికీ..: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి