CM Revanth Reddy Speech: అప్పుడు ప్రగతి భవన్‌ ముందు ఎర్రటి ఎండలో గద్దరన్న నిలబడినప్పటికీ..: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

ప్రగతి భవన్ ముందు కంచెలను బద్దలుకొట్టి... ప్రజావాణిలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వింటుంటే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోందని రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy Speech: అప్పుడు ప్రగతి భవన్‌ ముందు ఎర్రటి ఎండలో గద్దరన్న నిలబడినప్పటికీ..: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

Updated On : December 16, 2023 / 4:48 PM IST

Telangana Assembly: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్‌ ముందు ఎర్రటి ఎండలో గద్దరన్న నిలబడినప్పటికీ ఆయనను అందులోకి అనుమతించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారుపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు.

‘ప్రగతి భవన్ ముందు కంచెలను బద్దలుకొట్టి… ప్రజావాణిలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వింటుంటే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది. నాడు.. హోం మంత్రికే ప్రగతి భవన్ లోకి అనుమతివ్వలేదు. మంత్రి ఈటల రాజేందర్ కు అనుమతి ఇవ్వలేదు. అందుకే గేట్లను బద్దలుకొట్టి ప్రజా భవన్ చేశాం. మాది ప్రజా ప్రభుత్వం.. మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.

రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..

  • నిరంకుశత్వం ఎక్కువ కాలం నిలబడదు
  • ప్రజాతీర్పును గౌరవించకపోతే అంతే సంగతి
  • ప్రజా తీర్పు గౌరవించనందుకే బీఆర్ఎస్‌ను ప్రజలు ఓడించారు..
  • వాళ్లను ఎక్కడికి పంపాలో ప్రజలకు తెలుసు
  • ప్రజావాణిని మేము వింటుంటే బీఆర్ఎస్ భరించలేకపోతోంది
  • ప్రగతి భవన్ గేట్లు బద్దలుగొట్టింది మా పార్టీ.. మా ప్రభుత్వం
  • చట్టాల గురించి.. మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చిన వారికి ఏమి తెలుసు?
  • ఉద్యమ పార్టీ అన్న వారు.. తొమ్మిదిన్నర ఏండ్లలో అమరుల కుటుంబాలను ఒక్క రోజైనా ప్రగతి భవన్ కు అహ్వానించారా?
  • కేసీఆర్ కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు ఇచ్చారు
  • ఓడిన కూతురుకు పదవి ఇచ్చారు.. నిజం కాదా.?
  • పార్టీ పిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చారు
  • తెలంగాణ కోసం రాజీనామా చేసిన డీఎస్పీ నళినితో ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?
  • ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎందుకు ఎత్తివేయలేదు?