Partial Lockdown Chittoor : చిత్తూరు జిల్లాలో పాక్షిక లాక్‌డౌన్‌

చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఇవాళ్టి నుంచి పాక్షిక లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరులలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు.

Partial Lockdown Chittoor

Partial lockdown in Chittoor : చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఇవాళ్టి నుంచి పాక్షిక లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, పుంగనూరు, నగరి, పుత్తూరులలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి దుకాణాలు మూసివేయనున్నారు. అలాగే చిత్తూరు, మదనపల్లిలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకే దుకాణాలకు అనుమతిచ్చారు.

పలమనేరు, కుప్పంలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఇచ్చారు అధికారులు. వర్తక సంఘాల స్వచ్ఛంద నిర్ణయంతో దుకాణాలు మూసివేశారు. తిరుపతి నగరాన్ని మున్సిపల్ కమిషనర్‌ గిరీశా కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. నగరంలోని పలు వార్డుల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. తిరుపతిలో ఉన్న లక్ష ఇళ్లల్లో 10 వేల ఇళ్లల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాయలసీమలోనే ప్రతిష్టాత్మకంగా జరిగే తిరుపతి గంగమ్మ జాతరను రద్దు చేశారు.

తిరుపతిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు నగర పాలక కమిషనర్ గిరీషా. తిరుపతి కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో కరోనా కేసులు ఉండటంతో మొత్తం పట్టణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. వైరస్ కట్టడి బాధ్యతను ప్రజలే తీసుకోవాలన్నారు. మరోవైపు ఏప్రిల్ 27,2021 నుంచి తిరుపతిలో మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు ఉంటాయని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

మధ్యాహ్నం 2 తర్వాత స్వచ్చందంగా దుకాణాలు మూసివేసేందుకు చాంబర్ ఆఫ్ కామర్స్ అంగీకారం తెలిపిందన్నారు. తిరుపతి మార్కెట్ ని నగరంలో ఏడు ఎనిమిది చోట్ల డీ సెంట్రలైజ్ చేస్తామన్నారు. ఆటోలు, జీపుల్లో పరిమిత సంఖ్యో ప్రయాణికులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. గంగమ్మ జాతరను ఏకాంతంగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.