Pawan Kalyan Fans: విజయవాడలో పవన్ కల్యాణ్ అభిమానుల నిరసన

విజయవాడ నగరంలో పవన్ అభిమానులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. భీమ్లానాయక్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.

Bheemla

Pawan Kalyan Fans: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదల అవుతుందంటే ఫాన్స్ కు పండగే. తమ ఆరాధ్య నటుడి సినిమా విడుదల రోజు..అందరికంటే ముందుగా.. మొట్టమొదట బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు ఎంతో పోటీపడుతుంటారు. బెనిఫిట్ షోకి ఒక్క టికెట్ దొరికినా ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతుంటారు. కాగా, భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్లలో బెనిఫిట్ షో వేయాలంటూ పవన్ అభిమానులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా సినిమా థియేటర్ల ఓపెనింగ్ పై సందిగ్తత నెలకొనగా..కొన్ని షరతులను విధిస్తు థియేటర్లు తెరుచుకోవచ్చంటూ ప్రభుత్వం ప్రకటించింది. అయితే బెనిఫిట్ షోలు మాత్రం ప్రదర్శించడానికి వీల్లేదంటూ..ప్రభుత్వం హెచ్చరించింది.

Also read: Bollywood Love Affairs: మళ్ళీ పెళ్లి.. రెండోసారి పెళ్లి పీటలెక్కుతున్న సెలబ్రిటీస్!

ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయం పై పవన్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. విజయవాడ నగరంలో పవన్ అభిమానులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. భీమ్లానాయక్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతివ్వకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్లను కూడా ఆన్ లైన్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో మాకు అభ్యంతరంగా ఉందంటూ పవన్ అభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. థియేటర్ల వద్ద సినిమా, పవన్ అభిమానుల సందడి తప్ప ఏమీ ఉండదని ..ధియేటర్ల వద్ద ఆంక్షలు కరెక్ట్ కాదని వారు అన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అండగా నిలుస్తోండగా ఇక్కడ ఏపీలో మాత్రం వైసీపీ ప్రభుత్వం కావాలనే పవన్ సినిమా పై కక్ష సాధిస్తుందని పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. గతంలో సిల్లీ రీజన్ తో వకీల్ సాబ్ సినిమా ఆపాలని చూశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: Bheemla Nayak: రిలీజ్‌కి ముందే దంచి కొట్టి.. కలెక్షన్స్‌తో అదరగొడుతున్న భీమ్లా!